నాగశౌర్యకు తోడుగా మెహ్రీన్‌

టాలీవుడ్ యువ హీరోల్లో రొటీన్‌కి భిన్నంగా ప్ర‌య‌త్నించే కొద్దిమంది లో హీరో నాగశౌర్య ఒక‌డు. ల‌వ‌ర్ బాయ్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన భిన్న చిత్రాలు చేయాల‌న్న త‌పన‌తో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ని తాను మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించిన నాగ చైత‌న్య తానే కథకుడిగా మారి అశ్వత్థామ చిత్రంతో  31 జనవరి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  తన గత చిత్రాలకు భిన్నంగా  నాగశౌర్యకు తోడుగా మెహ్రీన్‌, ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌తేజ‌లు అండ‌గా నిల‌చిన‌ట్టే క‌నిపించింది.  మ‌రి ఈ సీరియస్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. 
ఇక కథ:
అమెరికా నుంచి విశాఖ‌లో త‌న కుటుంబంతో క‌ల‌సి ఉండేందుకు వ‌చ్చిన‌ గణ (నాగశౌర్య)  చెల్లి ప్రియ (సర్గన్ కౌర్)  అంటే ఎన‌లేని అభిమానం.  ఈ క్ర‌మంలో హ్యాపీగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు.  అయితే గ‌ణ సోద‌రి ప్రియకి నిశ్చితార్ధం జ‌రుగుతున్న స‌మ‌యంలో  ఆమె ఆత్మహత్య కు య‌త్నిస్తుంది.  దీనిని గ‌మ‌నించిన గ‌ణ  ఆమెను నిలువ‌రించి నిల‌దీస్తాడు.  త‌ను  గర్భవతి అని, ఇందుకు కార‌ణ‌మెవ‌రో తెలియ‌ద‌ని చెప్ప‌డంతో చెల్లెలు చెప్పేస‌రికి  షాక్ కి గురవుతాడు గుణ‌. దీంతో స‌మ‌స్య‌కి ప‌రిష్కారం క‌నుగొనాల‌నుకుంటాడు. ప్రియ‌కి అబార్షన్ చేయించి, పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేసి రంగంలోకి దిగుతాడు.  త‌న చెల్లెలే గ‌ర్భానికి కారణమైన వాడిని పట్టుకొనే క్రమంలో కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు. 
 విశాఖలో అమ్మాయిలు అదృశ్యం కావడం ,  త‌రువాత కనపడ్డా… వాళ్లు గ‌ర్భ‌వతుల‌ని తేల‌టం… తన చెల్లిలానే చాలామందికి అదే పరిస్థితి ఎదుర్కొంటున్న‌ట్టు గ‌మ‌నించిన గుణ కిడ్నాప్ లు ఎందుకు జరుగుతున్నాయో?  వీటి  వెనుక ఎవరున్నారో చేసిన అన్వేష‌ణ ఏమేర‌కు ఫ‌లించింది?   గణ వాళ్ళని పట్టుకొని శిక్షించాడా?  చివ‌ర‌కి ఏమైంది? అన్న‌ది చిత్ర క‌థాంశం 
ఎలా ఉందంటే…. 
ప్రస్తుత సమాజంలోని ఒక బర్నింగ్ పాయింట్ తీసుకుని దాని చుట్టూ ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ సెటప్ అల్లుకుని,  కమర్షియల్ గా, మెసేజ్ ఓరియెంటెడ్ గా చిత్రాన్ని బ్యాలన్స్ చేస్తూ   పవర్ ప్యాకెడ్ సినిమాగా అశ్వథ్థామని తెరకెక్కించే  ప్రయత్నం నిజంగా అభినంద‌నీయం.  పవన్ కల్యాణ్ వాయిస్ ఓవ‌ర్‌తో కుటుంబాన్ని పరిచయం చేస్తూ  తొలి భాగంలో ఆసక్తికర  సన్నివేశాలను మేళ‌వించుకుంటూ సాగ‌టం చాలా రొటీన్‌గా, నార్మల్‌గా అనిపించింది. అయితే అస‌లు క‌థ‌లోకి ప్ర‌వేశించడానికి చాలా టైమ్ తీసుకున్న‌ట్టు క‌నిపిస్తుంది.  ఉండటంతో ప్రేక్షకుడు కథలో లీనం కావడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రేక్ష‌కుడు మాత్రం సినిమా చాలా స్లోగా కదులుతోంద‌న్న‌ ఫీలింగ్ కు లోనయ్యే అవ‌కాశం ఉంది.   హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ కూడా బలవంతగా ఇరికించిన ప్రయత్నంగా క‌నిపిస్తుంది త‌ప్పా. ఎక్క‌డా స‌హ‌జ‌త్వం ఉండ‌దు. ఇక చెల్లికి పెళ్ళి చేసిన పంపేసిన గుణ‌ విలన్ ని వెదుకుతూ వెళ్ళే సీన్లు క్ర‌మ‌క్ర‌మంగా మంచి ఉత్కంఠగా రూపొందించాడు ద‌ర్శ‌కుడు.  అయితే సోషల్ మెసేజ్‌ని, కమర్షియాలిటీని  మిళితం చెయ్యడంలో దర్శకుని అనుభవలేమి కొంత క‌నిపించింది. తొలి భాగంలో కథనం  కొంత‌ సాగుతున్న‌ట్ట‌నిపించినా… సెకెండాఫ్‌లో పూర్తిగా రొటీన్‌లా మారింది.   సస్పెన్స్‌ని మైంటైన్ అవుతోంద‌న్న స‌మ‌యంలో విల‌న్‌ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌టం ఉత్కంఠ బిగువు త‌గ్గిపోయింది. దీంతో విల‌న్ కోసం హీరో చేసే వ్యూహాలు ప్రేక్ష‌కుల ఊహ‌ల ముందు తేలిపోయాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  పోసాని, సత్య, జయ ప్రకాష్ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ ని సరిగా ఉపయోగించుకోకపోవడం, హీరో హీరోయిన్ మధ్య సరైన కెమిస్ట్రీ లేకపోవడం మైనస్ గా చెప్పవచ్చు. యాక్షన్ ట్రాక్,  ఎమోషనల్ ట్రాక్‌ల న‌డుమ త‌గిన తీరుగా మేలిక‌ల‌యిక చేయ‌టంతో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు.  స‌మాజంలో నిత్య‌కృత్య‌మైపోయిన స‌మ‌స్య‌కు కొంతైనా స‌మాధానం ఇచ్చారా? అంటే అదీ లేదు. క్వశ్చన్ మార్క్‌తో సినిమాని ముగించేయ‌టంతో అశ్వథ్థామ ఏదో చేస్తాడనుకుంటే ఇలా చేసాడేంట‌బ్బా అనిపించ‌క మాన‌దు.  అయితే ఇటీవల కాలంలో నాగశౌర్య చేసిన సినిమాల్లో బెటర్ అనే ఫీలింగ్‌తో ధియేట‌ర్ల‌నుంచి బైట‌కు రావ‌చ్చు. 
 నాగ‌చైత‌న్య ఎలా చేసాడంటే 
న ఇమేజ్‌ ముద్ర పడకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడం నాగశౌర్య అభిరుచికి అద్దం పట్టింది.  లవర్ బాయ్‌గా కనిపించే నాగశౌర్య అశ్వత్థామలో తన ఇమేజ్ కి భిన్నంగా ఓ మాస్ రోల్ ట్రై చేసి  సక్సెస్ అయ్యాడు.  యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. సీరియస్ ఎమోషనల్ సన్నివేశాలలో కూడా డిఫరెంట్ మేనరిజం తో అలరించారు. ఫ్యామిలీ కథతో తన ప్రతిభను చాటుకొనేందుకు చేసిన ప్రయత్నంగా అనిపిస్తుంది.ఎక్కడ రాజీ పడకుండా కష్టపడ్డాడు. ఆ కష్టం తెరపై కనిపించింది.  కథను కూడా త‌నే అందించి  మాస్ హీరోగా నిరూపించుకోవాలన్న  ప్రయత్నం  ఫ‌లించింద‌నే చెప్పాలి.  
 
ద‌ర్శ‌కుడు 
 ఓ క్రైమ్ థ్రిల్లర్ ని ఎక్కడా డీవియేట్ కాకుండా తెరకెక్కించడంలో దర్శకుడు కొంత స‌ఫ‌ల‌మ‌య్యాడు. అయితే నాగ‌చైత‌న్య రాసుకొచ్చిన క‌థ‌ని య‌ధాత‌ధంగా తెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేసాడు మిన‌హా  ఎక్క‌డా తన ఆలోచనలను ఏమీ ఆ స్క్రిప్ట్‌లో పెట్టలేదు అనిపిస్తుంది.  సెకండ్ హాఫ్‌లో స‌స్పెన్స్‌ని మరికొంత సేపు కొనసాగించే అవకాశం ఉన్నా  ఆ దిశగా ఆలోచించిక పోవ‌టంతో మ‌ళ్లీ సినిమా రొటీన్ ట్రాక్‌లోకి వెళ్లిపోయింది.  సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇంకా బలమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. ఇదే సినిమాకి అతి పెద్ద  మైనస్ పాయింట్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.  
మెహ్రీన్‌
 ఇంత సీరియ‌స్ సినిమాకి హీరోయిన్ అవసరం లేకున్నా,  కమర్షియల్ ఫార్ములా అంటూ మెహ్రీన్ ని తీసుకువ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.  బలవంతంగా ఆమె కోసం, హీరోకి ఓ ప్రియురాలు ఉండాల‌న్న సినీ నిబంధ‌న‌లు ఆక‌ళింపు చేసుకుని మ‌రీ ఓ పాత్రని క్రియేట్ చేసి, కథలో ఇరికించారని పిస్తుంది. దీంతో మెహ్రీన్ న‌టించే స్కోపే లేకుండా పోయింది.  గ్లామర్ పండించడానికి  ఆటపాటలకే ఆమె పరిమితమైంది. 
న‌టీన‌టులు 
చెల్లి ప్రియ గా సర్గన్ కౌర్ , సోదరి భర్తగా ప్రిన్స్,   పోలీస్ గా పోసాని, హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించిన సత్య త‌మ మార్కులో చేసుకుపోయారు. తెలుగు తెరకి  బెంగాలీ యాక్టర్ జిషుసేన్ గుప్తాని ఈ చిత్రంద్వారా ప‌రిచ‌య‌మ‌య్యాడు. కామాంధుడైన సైకో విలన్ గా త‌న‌దైన‌శైలిలో ఆకట్టుకొన్నాడు. అయన బాడీ లాంగ్వేజ్ కి డ‌బ్బింగ్ చెప్పిన హేమ చంద్ర వాయిస్ చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో న‌టించిన వారంతా  పాత్రలపరిధిమేర డీసెంట్‌గా నటించారు. 
 
సాంకేతిక నిపుణులు
జిబ్రాన్ సంగీతం, రీరికార్డింగ్ బాగున్నాయి, చెల్లెలు  సెంటిమెంట్ పాటలు చాలా బాగా వ‌చ్చాయి. శ్రీచరణ్ పాకాల అందించిన పాటలు పరవాలేదు.  మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బావుంది. యాక్షన్ సీక్వెన్సెస్‌లో అతని కష్టం కనిపిస్తుంది.  ఎడిటింగ్ విభాగం త‌మ క‌త్తెర‌కి ప‌ని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది  అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ బాగానే ప‌నిచేసార‌నిపించ‌క మాన‌దు. 
  
చివ‌రిగా
 ఐరా క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆసక్తికరమైన పాయింట్‌ను సరిగా తెర మీద కన్విన్సింగ్ చెప్పడంలో తడబాటుకు గురయినా,  ఓవరాల్‌గా చూసుకుంటే ఆడవాళ్లను గౌర‌వించాలి అనే మెసేజ్  ఇవ్వ‌టంలో నాగ శౌర్య  ప్రయత్నం వృధాపోద‌నే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published.