వీళ్ల‌కు స‌రిలేరు అంటే ఎందుకు పడదు?

కార‌ణ‌మేదైనా సినీ సెలబ్రిటీలు సరిలేరుపై దాదాపు స్పందించన‌ట్టే క‌నిపిస్తోంది. సినిమా చూసి నేనే తొలికాల్ చేస్తానంటూ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి సినిమా నచ్చలేదు గనుకే మ‌హేష్‌కి ఫోన్ చేయ‌లేద‌ని ఓ టాక్ ఇప్పుడు ఫిలిం న‌గ‌ర్‌లో నడుస్తోంది. అంతెందుకు స‌న్నిహితంగా ఉండే జూ. ఎన్టీఆర్ కూడా అల్లు అర్జున్‌ను బావా, స్వామీ అంటూ పలకరిస్తూ… అల పై ట్వీట్ చేశాడు. అన్న క‌ళ్యాణ్ రామ్ ఎంత‌మంచివాడ‌వురా… అంటూ మెచ్చుకున్నాడు కానీ మహేశ్‌ను అస్సలు పట్టించుకోవడం ‘సరిలేరు’ గురించి కనీసం సింగిల్ ట్వీట్ కూడా చేయకపోవడం గమనార్హమంటున్నారు సినీ జ‌నాలు.

అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా ‘అల..’ గురించి తన ఫేస్‌బుక్ వాల్‌లో ‘అల వైకుంఠపురములో …త్రివిక్రమ్ గారు తన సత్తాను మరోసారి చాటారంటూ ప్ర‌శంస‌లు గుప్పించాడు మిన‌హా మ‌హేష్ సినిమా గురించి మాట మాత్రం కూడా చెప్ప‌లేదు.
ఒకరోజు గ్యాప్‌లో విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమాపై సినీ పెద్దలు సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నా, సరిలేరుపై ఎందుకు స్పందించట్లేదన్నది మాత్రం ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది.
  

Leave a Reply

Your email address will not be published.