గోడ మీద వార్తలు


28 – 02 – 2020

01 . విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర బాబుని అడ్డు కున్న వైకాపా కార్యకర్తలు – తనని ఎన్కౌంటర్ చేసినా సరే యాత్ర చేసి తీరతానన్న – చంద్ర బాబు …

ఇంకానయం – సొక్కా సించుకుని దమ్ముంటే గుండెలపై గుండెలపై కాల్చండ్రా అంటూ గంతు లేయలేదు …!!

02. త్వరలో దేశ వ్యాప్తంగా స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లు బిగించే ఆలోచనలో కేంద్రం – డ్యూ డేట్ దాటితే ఆటోమేటిక్ గా పవర్ కట్ …

మంచిది – ఆ చేత్తోనే ఒక్క పూట కరెంటు కట్ చేసినా ప్రభుత్వాల పవర్ కట్టయ్యే ఏర్పాట్లు కూడా చేస్తే సరి…!!

03. పవర్ ప్రాజెక్టుల విషయంలో ఓ దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వలన విదేశాల్లో దేశం పరువుపోయింది – కేంద్రమంత్రి పీయూష్ గోయల్ …

క్షవరం అయితే గానీ ఇవరం తెలీదని – గొరగాల్సినదంతా గొరిగేసాక ఇప్పుడు పీక్కునేం లాభం …??

04. CAA – NRC లకి మా ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం – మీరంతా రాజస్థాన్ కాదు పాకిస్థాన్ నుండి వచ్చిన వారైనా సరే మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన – తెరాస నేత …

మంచిది – ఆ చేత్తోనే బంగ్లా పాక్ బార్డర్ల నుండి నేరుగా భాగ్యనగరానికి బస్సేస్తే సరి – ఆర్టీసీ అన్నా లాసులో నుండి బయటపడుద్ది…!!

05. విశాఖలో వైకాపా పెయిడ్ ఆర్టిస్టులే చంద్ర బాబు పై దాడి చేసారు – లోకేష్ …

ఊరంతా లేచాక కునుకుడు కోడి లేచి కూసిందని – కొత్తవేవఁన్నా ఉంటే చెప్పు సామీ …!!

“తెలుగువారందరం తెలుగులోనే మాట్లాడుకుందాం “

మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!

         “”జైహింద్””

Leave a Reply

Your email address will not be published.