ఫుట్‌బాల్ కోచ్‌గా విజయ్

తమిళ స్టార్ హీరో విజయ్ జోరు గురించి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి క్రేజు ఉన్న హీరోగా వెలిగిపోతున్నాడు. దళపతి తర్వాత ఇలయదళపతి అన్న పేరు తెచ్చుకున్నాడు. అతడు వరుసగా మురుగదాస్, అట్లీ వంటి దర్శకులతో సినిమాలు చేస్తూ సంచలన విజయాలు అందుకుంటున్నాడు. ఇటీవలే మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘సర్కార్’ చిత్రంతో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో కెరీర్ 63వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదివరకూ ఈ జోడీ తేరి, మెర్సల్ (అదిరింది) వంటి చిత్రాల కోసం కలిసి పని చేశారు. ఆ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. విజయ్  అట్లీ కాంబినేషన్ మూవీ ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ ఓ ఫుట్ బాల్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు. చెన్నయ్ లో షూటింగ్ జరుగుతోంది. విజయ్ తో పాటు 100 మంది చిన్నారుల బృందంపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఒక స్టూడియోలో వేసిన సెట్ లోనే నేపియర్ బ్రిడ్జిని చిత్రబృందం క్రియేట్ చేసిందిట. చిన్నారులతో కలిసి విజయ్ డ్యాన్సులు చేస్తున్నారు. ఈ తరహా ఇలయదళపతికి కొత్తేమీ కాదు. ఇక ఈ చిత్రానికి స్వరమాంత్రికుడు, ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండడం ప్రధాన బలం. ఎ.జి.ఎస్ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. నయనతార, వివేక్, కదిర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.