గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించిన సినీ నిర్మాత అశ్వినీదత్‌ …

ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించారు. ఆయనకు ఏపీలోని నర్సాపూర్‌ ఎంపీ రఘరామకృష్ణంరాజు గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు. ఈ సందర్భంగా అశ్వినీదత్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. నగరంలోని గచ్చిబౌలిలో గల తన నివాసంలో ఆయన తన కుమార్తె ప్రియాంకాదత్‌, మనవడు రిషి కార్తికేయలతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ వ్యవస్థపాకుడు రాఘవ, హెల్పింగ్‌ హాండ్స్‌ ప్రతినిధి సుబ్బారాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

 అనంతరం అశ్వినీదత్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాలన్నారు. మనవ మనుగడకు మొక్కలు ఎంతగానో సహకరిస్తా యన్నారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ను ప్రశంసించారు. మరో ముగ్గురికి అశ్వినీదత్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు. దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో విజయ్‌ దేవరకొండ, కాకినాడ పోర్ట్‌ చైర్మన్‌ కే.వి.రావు, డాక్టర్‌ జయంతిలకు ఆయన గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు.

Leave a Reply

Your email address will not be published.