కోపమా నాపైన!

గాసిప్పులపై ఒక్కొక్కరి స్పందన ఒక్కోలా ఉంటుంది. అందాల కథానాయిక రష్మిక మందన తనపై వచ్చే గాసిప్పులపై ఇదివరకూ సీరియస్ అయ్యేది. కన్నడ పరిశ్రమ ను వదిలేసి తెలుగు సినీపరిశ్రమకు వెళ్లిపోయిందని, ఆ క్రమంలోనే తనని ప్రేమించిన యువకుడిని దూరం చేసుకుందని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ చేశారు. వాటిపై తనదైన శైలిలో అప్పట్లో సమాధానం ఇచ్చింది రష్మిక. తాజాగా ఈ భామ తనపై ఓ వెబ్ మీడియాలో వచ్చిన వార్తలకు కాస్తంత సెటైరికల్ గానే స్పందించింది . కన్నడ పరిశ్రమపై నేను కోపంగా ఉన్నానని రాశారు. సొంత పరిశ్రమపై ఎవరైనా అలా ఉంటారా ? ఉంటే ఆధారాలు చూపండి! అని అంది. రష్మిక విషయంలో అప్సెట్ అయిన కన్నడ చిత్ర పరిశ్రమ అంటూ రాశారు. ఆ ధారాలు లేనిదే నమ్మను. ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి. ఆధారం ఉంటే నాకు మెసేజ్ చేయండి అంటూ నవ్వేసింది రష్మిక. ఈ అమ్మడు ఛలో, గీత గోవిందం, దేవదాసు చిత్రాల తర్వాత దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది. నితిన్ సరసన వెంకీ కుడుముల దర్శకత్వం లో భీష్మ అనే చిత్రంలో అవకాశం అందుకుంది. యజమాన, పొగరు అనే కన్నడ చిత్రాల్లోనూ నాయిక గా నటిస్తోంది.