గజపతి రాజుల లక్షల కోట్ల ఆస్తులకు కాళ్లు వచేస్తున్నాయా…?

వియనగరం రాజులు స్థాపించిన మాన్సాస్ ట్రస్టు నుంచి వందకు పైగా ఆలయాలకు వారసత్వ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిని ఎలాగైనా తప్పించాలని వ్యూహం రచించిన మంత్రి బొత్స సత్యనారాయణ వ్యూహాత్మకంగా అప్పుడెప్పుడో మూడు దశాబ్దాల క్రితం రాజకుటుంబం నుంచి విడాకులు తీసుకుని విడిపోయిన గజపతులు వారసురాలిగా సంచయితా గజపతిరాజును తెరపైకి తెచ్చి, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (సింహాచలం) ట్రస్టు బోర్డు చైర్మన్ గా, మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మన్ సాస్) చైర్మన్ గా సంచయితా గజపతిరాజు ని నియమించడం, కొద్ది రోజుల కిందట ఆమె ప్రమాణ స్వీకారం చేయటం చకచకా జరిగిపోయాయి. ఇందుకు వైసిపి రాజకీయ లక్ష్యంతో పాటు సింహాచల దేవస్ధాన పరిధిలో ఉన్న10 లక్షల కోట్ల భూములపై కన్నుపడటమే కారణమన్న ఆరోపణలూ లేకపోలేదు.
నిజానికి విజయనగరం గజపతి రాజుల వంశానికి చెందిన పి వి జి రాజు 1958లో స్థాపించిన మన్ సాస్ ట్రస్టు, సింహాచలం ట్రస్టు వారసత్వంగా గజపతి వంశానికి చెందిన మగపిల్లలకు మాత్రమే సంక్రమిస్తుంది. పి వి జి రాజు మరణానంతరం ఆయన పెద్ద కుమారుడు ఆనంద గజపతి రాజు ఈ రెండు బోర్డులకు చైర్మన్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన మరణించడంతో తెలుగుదేశం పార్టీ నాయకుడు అశోక్ గజపతి రాజు ఆ రెండు పదవులను స్వీకరించి, వారసత్వంగా వచ్చిన ఆ రెండు బోర్డులను ఆయననే నిర్వహిస్తున్నారు.
ఈ ట్రస్తుకు చెందిన భూములను, భవనాలను, షాపులను నామమాత్రపు అద్దెతో అనుభవిస్తూ వారంతా విజయనగరం రాజులు తమకు కిచ్చిన అదృష్టం అని చెప్పుకుంటారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల కన్ను ఈ బోర్డుల సారధ్యంలో ఉన్న లక్షల కోట్ల ఆస్తులపై పడటంతో ఎలాగైనా కదిలించాలని ప్లాన్ చేసుకోవటంతో మంత్రి బొత్స సలహాతో ఆనంద గజపతి రాజు రెండో భార్య అయిన ఉమా గజపతి రాజు రెండో కుమార్తె అయిన సంచయితా రాజు ను తెరపైకి తీసుకువచ్చారు. ఢిల్లీలో బిజేపి భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా వ్యవహరిస్తున్న సంచయితా గజపతి సొంతంగా ఓ ఎన్టీవోని నిర్వహిస్తోంది. ఏళ్ల నుంచి గజపతుల ఇంటి ముఖం ఎరుగని సంచయితా రాత్రికి రాత్రే ప్రభుత్వం జీవోలు జారీ చేసేయటంతో అశోక్ గజపతిని తప్పించి, ఈ రెండు బోర్డులకు చైర్మన్ అయిపోయారు.
అయితే సంచయితాకి పార్టీ నుంచి పెద్ద తలనొప్పే వచ్చి పండింది. పార్టీకి చెప్పకుండా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నామినేటెడ్ పోస్టులను ఎలా స్వీకరించారంటూ భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇప్పుడు సంచయితా గజపతిరాజు కి షో కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ వ్యవహారంపై బిజెపి కాస్త సీరియస్ గా ఉన్నట్టే కనిపిస్తోంది.
మరోవైపు గజపతిరాజుల మగ వారసులు మాత్రమే ఈ ట్రస్టుకు, బోర్డుకు ఎంపికయ్యే అధికారం ఉంటుందని, పి వి జి రాజు రాసుకున్న వీలునామాలో ఉంది. ఇప్పటి వరకు అది కొనసాగింది కూడా. అయితే ఈ వీలునామాని తుంగలోకి తొక్కి ప్రభుత్వం వారసురాలంటూ బిజెపి నేతని తీసుకురావటం వెనుక ఆంతర్యం జనం గమనిస్తునే ఉన్నారు. మరి సంచయితా బిజెపి అధిష్టానానికి వివరణ ఇస్తుందా? లేక పదవి కోసం ఆ పార్టీకి రాజీనామా చేసి, వైసిపిలో చేరుతుందా? ఓవేళ ఈ విషయంపై అశోక్ గజపతి కోర్టు మెట్లు ఎక్కితే పరిస్థితి ఏంటి? సంచయితా పదవి మూన్నాళ్ల ముచ్చటేనా? లక్షల కోట్ల ఆస్తులపై దృష్టి సారించిన ప్రభుత్వ పెద్దల పాచికలు ఫలిస్తాయా? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు జనం మధ్య నానుతున్నాయి.