నీరు కారిన డ్రగ్స్ కేసు సినీ నటులకు క్లీన్ చిట్

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కలకలం పలువురు నటులను ఓ కుదుపు కుదుపింది. ఈ వ్యవహారంతో టాలీవుడ్‌లో సినీ పెద్దలు  ఆందోళన చెందారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులపై ఎక్సైజ్ శాఖ, సిట్ అధికారులు కేసు నమోదు చేశారు.  వీరిలో హీరోలు, హీరోయిన్లు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈవ్యవహారం కలకలం రేపింది. అభియోగం ఎదుర్కొంటున్న వారిని అధికారులు పిలిపించి ప్రత్యేకంగా విచారణ కూడా చేపట్టారు. అయితే మూడేళ్లుగా నడుస్తున్న ఈ కేసు మాత్రం ఎటూ తేలలేదు. అయితే కేసు వ్యహవారం ఏడాది పాటు నడిచింది. చివరిగా ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసులో ఉన్న పలువురు నటులకు  అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు.  
డ్రగ్స్ కేసులో ఇప్పటికే సిట్ చార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఇంతవరకు కోర్టుకు మాత్రం డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక అందలేదు. అయితే ఆర్టీఐ ద్వారా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచారం కోరిన ఎక్సైజ్ శాఖ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. డ్రగ్స్ కేసును నీరుగారుస్తున్నారని గతంలో సీఎస్‌కు పలువురు ఫిర్యాదులు కూడా చేశారు. అయితే గతంలో కూడా డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇలాంటి వార్తలే వచ్చాయి. దీంతో వాటిలో వాస్తవం లేదని ఎక్సైజ్ శాఖ అధికారులు ఖండించారు. మేం ఎవరికి ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని అధికారులు తెలిపారు..

Leave a Reply

Your email address will not be published.