రతిన శివ దర్శకత్వంలో హీరో జీవా

రతిన శివ దర్శకత్వంలో హీరో జీవా నటించిన తాజా చిత్రం స్టాలిన్. దీనికి అందరివాడు ఉపశీర్షిక పెట్టరు. జీవా సరసన తెలుగులో మజ్ను, పేపర్ బాయ్ చిత్రాల్లో నటించిన రియా సుమన్ నాయికగా నటించగా, మరో కథానాయకిగా గాయిత్రి కృష్ణ కనిపించనుంది. ప్రముఖ తెలుగు హీరో నవదీప్ ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్రలో నటించడం ఓ విశేషం.
తమిళంలో వరుస హిట్ చిత్రాలను అందించిన వేల్స ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలసి తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ నట్టిస్ ఎంటర్టైన్మెంట్స, క్విటీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాతలు డాక్టర్ ఇషారి కె.గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ బాషలలో ఫిబ్రవరి 7న ఒకే రోజున ఈ చిత్రం భారీగా విడుదలకానుంది. ఇదే చిత్రం తమిళంలో సీరు పేరుతో విడుదలవుతుంది. ఫిబ్రవరి 2న హైదరాబాద్లో ఆడియోను విడుదల చేయనున్నాం. చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు అని చెప్పారు!!