హీరో నుంచి విల‌ర్‌గా మారాక ఛాన్సులే

హీరో నుంచి విల‌ర్‌గా మారాక జ‌గ‌ప‌తి బాబు చాలా మంచి ఛాన్సులే ప‌ట్టేస్తున్నాడు. ఇత‌ర భాష‌ల‌లోనూ జ‌గ‌ప‌తి బాబు ని విల‌న్‌గా ఎంచుకుంటుండ‌టంతో డిమాండ్ బాగానే పెరిగింది. కెరీర్ అడుగంటుతున్న ద‌శ‌లో బోయ‌పాటి చేసిన ప్ర‌యోగం జ‌గ‌ప‌తిబాబు లైఫ్‌కి పెట్ట ట‌ర్న్ ఇచ్చాయ‌న‌టంలో సందేహం లేదు. ఓ వైపు కీల‌క పాత్ర‌లు పోషిస్తూనే, మ‌రోవైపు విల‌న్‌గానూ త‌న స‌త్తా చాటుతున్నాడు
తాజాగా ‘బాహుబలి, ‘సాహో’ లాంటి భారీ బడ్జెట్‌ చిత్రాల అనంతరం యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్). సినిమాలోనూ ప్ర‌భాస్ సైతం విల‌న్‌గా జ‌గ‌ప‌తిబాబునే సూచించిన‌ట్టు స‌మాచారం. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నటించబోయే పాత్రలో ఇదివరకెప్పుడూ జగపతి బాబు నటించలేదని, ఆత‌ని సినీ కెరీర్‌ అదిరిపోయేలా ఈ పాత్ర తీర్చిదిద్దార‌ని, ఇందులో జగపతి బాబు లుక్, డైలాగ్ డెలివరీ భిన్నంగా ఉంటుందంటోంది చిత్ర ప‌రివారం.
ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటిస్తున్న‌ ఈ సినిమాకు సంబంధించి ‘రాధేశ్యాం’, ‘ఓ డియర్’ అనే టైటిల్‌ను రిజిస్ట్రేషన్ చేయించారని వార్తలు వస్తున్నాయి. 

Leave a Reply

Your email address will not be published.