బాక్సాఫీస్ కా బాప్ – మహేష్ బాబ్ …

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు వార్ వన్‌సైడ్‌గా నడుస్తోంది. మహేశ్‌బాబు పలు సినిమాలు బాక్సాఫీసు ఓరిలో నిలిచాయి. కాని  సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు మాత్రం మహేశ్ నటనను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ సినిమాతో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసి బాక్సాఫీసు వద్ద దుమ్ము దులుపుతున్నాడు.  తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు బీట్ చేసిన మహేశ్… ఎనిమిది రోజుల్లో రూ.112.3 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ లెక్కల్ని సరిచేస్తున్నాడు. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.7 కోట్ల షేర్ వసూలు చేసి తన కెరియర్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్… సంక్రాంతి సెలవుల్లో కూడా మోత మోగించాడు. ఇక వీకెండ్ కూడా సినిమాకు మరిన్నీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. బాక్సాఫీస్ కా బాప్.. అంటూ తొలి ఎనిమిది రోజుల్లో రూ.112.03 కోట్లు షేర్ రాబట్టి సంక్రాంతి మొగుడు అనిపించుకుంటున్నాడు మహేష్. 

‘సరిలేరు నీకెవ్వరు’ ఎనిమిది రోజుల షేర్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు బీఏ రాజు.. ఇక 8 రోజుల్లో నైజాంలో రూ.29.8 కోట్లు, సీడేడ్‌లో రూ.13.2 కోట్లు, యూఏలో రూ.14.9 కోట్లు, గుంటూరులో రూ.8.51 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.9.04 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.6.02 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.7.34 కోట్లు, నెల్లూరులో రూ.3.32 కోట్లు వసూలు చేయగా… కర్ణాటకలో రూ.7 కోట్లు, తమిళనాడులో రూ.కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.5 కోట్లు, యూఎస్‌ఏలో రూ.7.85 కోట్లు, ఆర్‌ఓడబ్ల్యూ 2.5 కోట్లు.. మొత్తం ఎనిమిది రోజుల షేర్ రూ.112.03 కోట్లుగా పేర్కొన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో అనీల్ సుంకర నిర్మించగా… మహేష్‌ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలకపాత్ర పోషించగా, ప్రకాశ్‌రాజ్ తనదైన విలనిజంతో మెప్పించాడు.  దేవీశ్రీ ప్రసాద్ సంగీతం  ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

Leave a Reply

Your email address will not be published.