మెగా, అల్లు ల మ‌ధ్య తేడా వ‌చ్చిందా?


మెగా ఫ్యామిలీలో ఏ హీరో సినిమా ఫంక్ష‌న్ జ‌రిగినా ఆ ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని గుర్తు చేసుకోకుండా ఫ్యాన్స్ ఉండ‌రు. ఖ‌చ్చితంగా ప‌వ‌న్ పేరును తీసుకువ‌స్తారు. వేదిక మీద ఉన్న హీరో ప‌వ‌న్ గురించి చెప్పేవ‌ర‌కు వ‌ద‌లిపెట్ట‌రు.

అయితే ఈ సారి నిన్న జ‌రిగిన బ‌న్నీ ఫంక్ష‌న్‌లో అంద‌రూ పవన్ కళ్యాణ్..పవన్ కళ్యాణ్ అంటూ అరుస్తున్నారని…కానీ ఈ కట్టే కాలేవరకు చిరంజీవికి అభిమానినని…చెప్పుకొచ్చాడు. అంతవరకు బాగానే ఉంది..కానీ చిరంజీవి తర్వాత ..తాను అభిమానించే హీరో…రజనీకాంత్ అంటూ రాష్ట్రం దాటి వెళ్లిపోయాడు బ‌న్నీ. త‌ను ఎప్పుడూ ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ పేరు ఖ‌చ్చితంగా చెప్పే బ‌న్నీ ఈసారి మాత్రం ఎందువ‌ల్ల‌నో అస‌లు ప్ర‌స్తావించ‌నే లేదు. ఫ్యాన్స్‌లో ఉన్న డౌట్స్‌ను మరింత పెంచేశాడు.

చిరంజీవి అంటే అల్లు అర్జున్‌కు అమితమైన‌ ప్రేమ..ఇది అందరికీ తెలిసిందే. బ‌న్నీ తండ్రి పై తన ప్రేమను చాటుకోవడం వరకు ఓకే..కానీ పనిగట్టుకుని పవన్ కళ్యాణ్‌ను ఎందుకు పక్కన పెట్టాల్సిన అవసరమొచ్చిందన్న చర్చ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో మొదలైంది.

అల్లు అర్జున్ స్పీచ్ పై పవన్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో గుర్రుగా ఉన్నారు. కావాలనే పవన్ ను బన్నీ టార్గెట్ చేశాడని…అ సందర్భంగా తమ హీరోను అవాయిడ్ చేసి..తన మనసులో ఉన్న ఉద్దేశ్యాన్ని బహిరంగంగా వ్యక్త పరిచాడని అంటున్నారు. ఇన్నాళ్లూ నివురు గప్పిన నిప్పులా ఉన్న పవన్-అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్న విభేదాలు …ఈ ఒక్క స్పీచ్‌తో మరింత రగులుకున్నాయని అంటున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ కి ఉన్న ఫ్రెండ్ షిప్ పైన అయిన ప‌వ‌న్ బ‌న్నీ ఫంక్ష‌న్‌కి గెస్ట్‌గా వ‌స్తార‌ని అంద‌రూ భావించారు. కానీ అది కాస్త బెడిసికొట్ట‌డంతో లేనిపోని కొత్త అన‌ర్ధాల‌కు దారి తీస్తుంది. ప్ర‌స్తుతం రాజ‌కీయంలో బిజీ అయిపోయిన ప‌వ‌న్ సినిమా ఫంక్ష‌న్ల‌కు వ‌చ్చే అంత తీరిక లేనిపోయిన‌ప్ప‌టికీ ఫ్యాన్స్‌లో మాత్రం వేరేగా గంద‌ర‌గోళం మొద‌ల‌యింది. 

Leave a Reply

Your email address will not be published.