బాలకృష్ణకి స్నేహితుడి పాత్రలో సునీల్

హాస్యనటుడిగా వెండితెరకు పరిచయమై హీరోగా మారిన సునీల్ కు వరుస పరాజయాలు ఇబ్బంది పెట్టాయి. దీంతో తిరిగి యధాతధంగా హాస్య పాత్రలవైపు అడుగులు వేసాడు. సపోర్టింగ్ క్యారెక్టర్లకీ సిద్దమై, మళ్లీ ట్రాక్ బాట ఎక్కే ప్రయత్నాలు ఆరంభించడంతో చేస్తునే ఉన్న సునీల్‌కి అవకాశాలు అందివస్తున్నాయి.
రవితేజ డిస్కోరాజాలో కీలక పాత్ర పోషించిన నటుడు సునీల్ తాజా దర్శకుడు బోయపాటి శ్రీను నేతృత్వంలో రూపొందుతున్న చిత్రంలో బాలకృష్ణకి స్నేహితుడి పాత్ర కు ఎంపికైనట్టు సమాచారం. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఈ చిత్రంలో ఉండే అవకాశం ఉండటంతో ఇందుకు సమాంతరంగా కామెడీ ట్రాక్ ని నడిపించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా మరోవైపు కాస్టింగ్‌పై బోయపాటి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది.