Untitled Post
సూపర్‌స్టార్ మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు‘ చిత్రంలో భారతి పాత్రతో రీఎంట్రీ ఇస్తున్నా లేడీ అమితాబ్ విజయశాంతి ఆ చిత్రానికి ఓ పిల్లర్ కానున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సూపర్‌స్టార్ మహేశ్ బాల నటుడిగా ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో విజయశాంతి కొడుకుగా నటించిన విషయం విదితమే… ఇన్నేళ్లకు సూపర్‌స్టార్ మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో విజయశాంతి రీఎంట్రీ ఇస్తుంటంతో ఈ చిత్రంలపై భారీ అంచనాలే ఉన్నాయి.
కాగా ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ తదుపరి విజయశాంతి కాల్షిట్లకోసం కొన్ని భారీ నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగాయి. లేడీ అమితాబ్ విజయశాంతితో నటింపజేపేందుకు పలు కథలు కూడా సిద్దమైపోతున్నాయని ఫిలింనగర్లో వినిపిస్తున్న మాట. నేటి భారతం’, ‘ప్రతిఘటన’, ‘కర్తవ్యం’, ‘ఒసేయ్ రాములమ్మ’ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించి జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతోందట ఇప్పుడు. మరి రాబోవు చిత్రాలు ఏస్థాయిలో ఉండబోతాయోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.