ప్రేమికుల రోజున కొత్త ట్విస్టు చెబుతాం

అక్కినేని నాగచైతన్య – సమంత జంటగా నటిస్తున్న సినిమా మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వ ం వహిస్తున్నారు. మధ్య తరగతి కుటుంబం.. భార్య భర్తల ఈగోల నేపథ్య ంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వైజాగ్ – వాల్టేర్ నేపథ్య ం ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు చెబుతున్నారు. ఇప్పటికే మిజిలీ ప్రీలుక్, ఫస్ట్ లుక్ ప్రతిదీ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. తాజాగా మరో కొత్త లుక్ ని టీమ్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా తొలి టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. ఆ మేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. సమంత- చైతూ పెళ్లి తర్వాత నటిస్తున్న తొలి చిత్రమిది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.