జూనియర్ రవితేజ హీరోగా ‘లైఫ్ అనుభవించు రాజా’…రవితేజ(జూనియర్), శృతి శెట్టి, శ్రావణి నిక్కీ హీరోహీరోయిన్లుగా రాజారెడ్డి మూవీ మేకర్స్ పతాకంపై, ఎఫ్ అండ్ ఆర్ సమర్పణలో రాజారెడ్డి కందల నిర్మించిన రామ్ కామ్ ఎంటర్‌టైనర్ ‘లైఫ్ అనుభవించు రాజా’. సురేష్ తిరుమూర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం నిర్మాణంత‌ర కార్య‌క్ర‌మాల‌న్ని పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో హీరో రవితేజ(జూనియర్) మాట్లాడుతూ….ఇది ప‌క్కా సినిమా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. నాకు మా చిత్ర యూనిట్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేసారు. 

హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ….మా సినిమాను మీ అందరూ చూసి హిట్ చెయ్యలని కోరుకుంటున్న అన్నారు. సంగీత ద‌ర్శ‌కుడు రామ్ మాట్లాడుతూ… సినిమాలో పాట‌ల‌న్నీ బాగా వ‌చ్చాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ఆడియోకి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తు, మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సినిమాలో రీ రికార్డింగ్ కూడా బాగా కుదిరిందని చెప్పారు. 

చిత్ర ద‌ర్శ‌కుడు సురేష్ తిరుమూర్ మాట్లాడుతూ…. ప్ర‌తి మనిషి జీవితంలో కొన్ని ఆనంద క్షణాలుంటాయి. అలాంటివే ఈ సినిమాలో క‌నిపిస్తాయి. అనుభవించు రాజా టైటిల్ సాంగ్ బాగుంది. ప్రేక్ష‌కులు కూడా మ‌న‌స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని ఆనందంగా అనుభ‌వించేలా ఉంటుందని అన్నారు.


Leave a Reply

Your email address will not be published.