కొత్తదనం కోసం తపనే విజయాన్నిస్తుంది! – నందమూరి బాలకృష్ణ

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 118. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్‌గా నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కొనేరు నిర్మించారు. మార్చి- 1న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ఆడియో మార్కెట్లోకి రిలీజైంది. హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో ఆడియో తొలి ప్రతిని నందమూరి  బాలకృష్ణ, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ విడుదల చేసారు. తొలి సీడీని ఎన్టీఆర్ అందుకున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, శేఖర్ చంద్ర, శ్రవణ్, నివేదా థామస్, షాలిని పాండే, మిర్చి కిరణ్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ– అన్నట్టుగా తనని తాను ఆవిష్కరించకుంటున్నాడు కళ్యాణ్. తనలో ఓ తపన కనిపిస్తోంది. మంచి సినిమాలు చేయాలని, కొత్తదనాన్ని అందించాలనే తపనే ఎన్టీఆర్ ఆర్ట్స్‌ను స్థాపించాడు. బాలగోపాలుడులో బాలనటుడిగా నటించారు. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన కోడిరామకృష్ణగారు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. 118 యువతరానికి కనెక్టయ్యే టైటిల్. ట్రైలర్ అద్భుతం. గుహన్ తెలుగులో డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. ఆయన ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలి. పెద్ద విజయంతో పాటు నిర్మాతలకు మంచి పేరు తేవాలి” అన్నారు. మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, మువ్వగోపాలుడు, బాలగోపాలుడు, భారతంలో బాలచంద్రుడు ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు కోడి రామకృష్ణ తనతో చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ సినిమాపై చాలా నమ్మకం ఉంది. ఇందులో పనిచేసిన నివేదా, షాలిని, నాజర్ సహా అందరికీ థాంక్స్. కొత్తదనం ప్రేక్షకుల ముందుకు తేవడానికి నేను ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఫెయిల్ అయ్యాను. నాతో పాటు అభిమానులకు కూడా ఈ విషయంలో బాధ ఉంది. తమ్ముడు తారక్ చెప్పినట్లు ఎప్పుడూ నేను కూడా ప్రేక్షకులను, అభిమానులను మెప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. 118 విజయంపై ధీమా ఉంది” అన్నారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆశీర్వదించిన బాబాయ్‌కి థాంక్స్. నాకు, గుహన్ చాలా ఏళ్లుగా పరిచయం. ఆయనతో నేను బాద్షా సినిమాకు పనిచేశాను. కష్టపడే తత్వ ం ఉన్న వ్యక్తి. ఆ సినిమాలో బంతిపూల జానకి పాట చాలా బాగా వచ్చిందంటే ఏకైక కారణం గుహన్. ఆ పాటను అద్బుతంగా తెరకెక్కించారు. అంతే అద్భుతంగా ఆయన దర్శకత్వంలో 118 రూపొందింది. గుహన్‌కి ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుంది. నివేదా థామస్, షాలినికి అభినందనలు. ఈ సినిమాను చూశాను. నివేదా పెర్ఫామెన్స్ చూసి నాకు తెలియకుండానే కళ్లలో నీళ్లు తిరిగాయి. మా జనరేషన్‌లో ఇంత గొప్ప నటి ఉన్న ందుకు ఆనందంగా ఉంది. ఆమె ఇలాగే కొనసాగాలి. షాలిని ఎంతో హుందాగా నటించారు. నిర్మాత కావాల్సిన వ్యక్తి. అద్భుత విజయం అందుకోవాలి. అన్నయ్య కల్యాణ్ రామ్.. కొత్త దోరణిలో కథ చెప్పాలనే తపిస్తాడు. ఆయన అందించిన చిత్రాల్లో నాకు ఇది చాలా బాగా నచ్చింది. హ్యాట్సాఫ్. ఈ చిత్రానికి అద్బుతమైన విజయం  దక్కాలి అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ –  సినిమా సమయంలో గుహన్ పరిచయం అయ్యారు. ఆ టైమ్‌లో కెమెరా డిపార్ట్ మెంట్‌లో పని చేస్తున్నారు. అటుపై సినిమాటోగ్రాఫర్‌గా ఎదిగారు. ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే కథలోని కొత్తదనం అర్థమవుతోంది. కల్యాణ్ రామ్ ప్రతి సినిమాలో ఏదో ఒకటి కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటారు. నిర్మాత గురించి ప్రస్థావిస్తే.. మహేష్ కొనేరు పీఆర్వోగా ఉన్నారు.  నందమూరి హీరో సినిమాకు నిర్మతగా ఎదిగారు. 118 మా సంస్థ ద్వారా సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. యూనిట్ కి శుభాకాంక్షలు” అన్నారు. దర్శకుడు కె.వి.గుహన్ మాట్లాడుతూ  పాయింట్‌ను నమ్మి సినిమా చేయడానికి అంగీకరించిన కల్యాణ్‌రామ్‌కి థాంక్స్. నివేదా చుట్టూనే ఈ సినిమా నడుస్తుంది. పాత్రకు ఊపిరి పోశారు. అర్జున్‌రెడ్డి తర్వాత షాలిని పాండే మా సినిమాలో నటించినందుకు థాంక్స్. విడుదల చేస్తున్న దిల్‌రాజుకి థాంక్స్‌” అన్నారు.

Leave a Reply

Your email address will not be published.