టక్ జగదీష్ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ఆరంభ‌మైంది….

నేచురల్ స్టార్ నానిహీరోగా  నిన్ను కోరి వంటి సూపర్ హిట్ చిత్రం శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వంలో రూపొందే టక్ జగదీష్ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ఆరంభ‌మైంది. ‘మజిలీ’ చిత్రాన్ని నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు…
ఈ మూవీ ఓపెనింగ్ కార్య క్రమాలు ఈరోజు జరిగాయి. మొదటి క్లాప్ దిల్ రాజు కొట్టగా ..సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ స్క్రిప్ట్ ను అందజేశారు . మైత్రి మూవీస్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దేవుని ప‌టాల‌పై తొలిషాట్‌ని ద‌ర్శ‌కుడు శివ చిత్రీక‌రించారు.  
ఈ చిత్రం గురించి శివ మాట్లాడుతూ  నా ప్రేమికులు సినిమా లో భార్యాభర్తల మధ్య కథ  ఎంత అందంగా చూపించానో  ఇప్పుడు అన్నదమ్ముల మధ్య నడిచే కథతో అంతేం అందంగా తెరకెక్కిస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో సోదరుల నడుమ ఉండే ఎమోషన్స్ , యాక్ష‌న్స్ సీన్స్‌ని బాగా వ‌చ్చాయ‌ని…. నాని సోదరుడిగా ఈ సినిమాలో ఓ సీనియర్ నటుడు నటించనున్న‌ట్టు చెప్పారు. తామ‌నుకున్న న‌టుడు సై అంటే ఈ సినిమాకి ఆత‌ను అసెట్‌గా నిలుస్తాడ‌ని చెప్పారు.  ఫిబ్రవరి 11 నుండి సినిమా సెట్స్ పైకి రానుందని చెప్పారు 
 ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో ‘వి’ తో  బిజీగా ఉన్న నాని ఆ సినిమాకు స‌మాంత‌రంగా ఈ చిత్ర షూటింగ్‌లోని పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published.