అనసూయ కథనం

ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్, ది గాయత్రి ఫిలమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కథనం. బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా ఈ చిత్రానికి నిర్మాతలు. రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో
రూపొందుతున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు సాంగ్స్ మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేసుకుని వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. అనసూయ మాట్లాడుతూ… కథనం సినిమా పేరు. కథనం అంటే కథని నడిపే విధానం.. మా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను క్షణంలో కనిపించిన పాత్రలో ఉన్నట్లు ఉందని అందరూ అనుకుంటున్నారు. కాని కాదు నాది ఈ చిత్రంలో ఎడి క్యారెక్టర్ ఒక అసోసియేట్ డైరెక్టర్  పాత్ర.  శర్మ మంగళ చిత్రం చేశారు. అలాగే నరేంద్ర చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్. నన్ను మెయిన్ లీడ్‌గా చూపిస్తున్నారు. చాలా మంచి చిత్రం వస్తోంది. పెళ్లి పృధ్వీగారు చాలా బాగా చేశారు. ఈ రోజుతో టాకీ పూర్తవుతుంది. 4షెడ్యూల్స్‌లో పూర్తయింది. వేసవిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు” అన్నారు.

ధన్రాజ్ మాట్లాడుతూ.. భాగమతి తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది నాకు. ఓ మంచి సినిమాతో అందరితో కలవాలనుకున్నా. పిల్లజమిందార్, భీమిలీకబాడీ జట్టు, రాజేష్ కథ విన్నాను. నాకు చాలా బాగా నచ్చింది. కొత్త పంథా క్రైమ్ థ్రిల్లర్ ఇది.. అన్నారు. ధృవ తర్వాత చక్కని పాత్రలో నటించానని రణధీర్ తెలిపారు.
నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ… చిరంజీవిగారి అభిమానిని నేను. డిస్టిబ్యూటర్‌గా అన్నగారి సినిమాతో స్టార్ట్ అయ్యాను. పార్ట్ టైం నిర్మాతగా మంగళ చిత్రం చేశాను.  ఈ చిత్రంతో పూర్తి నిర్మాతనయ్యా. రంగస్థలం నెల్లూరు కు పంపిణీ చేశాను. ఆయన ఏ సినిమా చేస్తే అది సూపర్ హిట్. ఇందులో ఫుల్ లెంగ్త్ కనపడుతున్నారు. ఇది డబుల్ బ్లాక్ బస్టర్  అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ సినిమాలో ధనరాజ్ ఒక ఆర్టిస్టుగా కాకుండా తన సినిమాలాగా ఫీలయి చాలా సాయం చేశారు. దర్శకుడు రాబోయే రోజుల్లో నెం.1 డైరెక్టర్ అవుతారని నమ్మకం ఉంది.. అన్నారు. ఇదే తొలి చిత్రమని రాజేష నాదెండ్ల అన్నారు. అనసూయ, ధన్ రాజ్, రణధీర్ పాత్రలు ఆకట్టుకుంటాయని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published.