సిఎఎకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన పంజాబ్.


వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంట‌నే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ  శుక్రవారం పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేర‌కు  రెండు రోజుల ప్రత్యేక సమావేశాలు జ‌రిపిన ప్ర‌భుత్వం త‌ర‌పున శుక్ర‌వారం ఆ  రాష్ట్ర మంత్రి బ్రహ్మ మొహింద్రా సిఎఎకు వ్యతిరేకంగా తీర్మానాన్ని స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. ఇప్ప‌టికే  పార్లమెంటు ఆమోదం పొందిన  సిఎఎ అమ‌లు కార‌ణంగా ప‌లువురిలో అనేక ఆందోళ‌న‌లు ఉన్నాయ‌ని, ముఖ్యంగా ముస్లిం వ‌ర్గాల‌ను త‌ర‌మివేస్తార‌న్న భావ‌న‌ దేశవ్యాప్తంగా నెల‌కొని ఉన్నందునే రోజు రోజుకీనిరసనలతో దేశం అట్టుడుకుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు మంత్రి.   ఈ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలోనూ  నిరసనలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని, ఇప్ప‌టికివి   శాంతియుతంగా క‌నిపిస్తున్నా రానున్న రోజుల‌లో అన్ని స్ధాయిల‌కు విస్త‌రించి దేశాన్ని నాశ‌స‌నం చేసేలా ఉన్నాయి అని మోహింద్రా తీర్మానాన్ని చ‌దువుతు ఆందోళ‌న వ్య‌క్తం చేసారు.  

సిఎఎకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన రెండవ రాష్ట్రం పంజాబ్. ముందు కేరళ అసెంబ్లీ కూడా ఇదే త‌ర‌హా తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టిన విష‌యం విదిత‌మే,

 

Leave a Reply

Your email address will not be published.