మెగా హీరో పై ఆ ద‌ర్శ‌కుడి క‌న్ను ప‌డిందా?

గ‌తంలో లింగుస్వామితో ద్విభాషా చిత్రం ప్లాన్ చేసిన బ‌న్నీ ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్నాక కూడా అది ఎందువ‌ల్ల‌నోగాని వ‌ర్క‌వుట్ కాలేదు.  గ‌తంలో చిరంజీవితో స్టాలిన్ చిత్రం చేశాడు. ప్ర‌స్తుతం మురుగుదాస్ క‌న్ను మెగా మేన‌ల్లుడు సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ పైన ప‌డినట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ద‌ర్బార్ చిత్రం విడుద‌ల హ‌డావిడిలో ఉన్న మురుగుదాస్ ఆ చిత్రం విడుద‌లైన  త‌ర్వాత సాయిధ‌ర‌మ్‌తేజ్ ని క‌లిసి క‌థ చెప్ప‌నున్నార‌ట‌. అయితే ఇటీవ‌లె ప్ర‌తిరోజూ పండ‌గే మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం మంచి హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే.

గ‌తంలో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన ‘చిత్రలహరి’ సినిమా మెగాస్టార్ చిరంజీవికి చాలా నచ్చింది. ఆ సినిమా తరువాత ఈ కథ చెప్తే… ‘చాలా బావుంది. ఈ సినిమాను ఎలా తీస్తారో? నువ్వెలా చేస్తావో చూడాలని ఉంది’ అని చిరంజీవి కూడా ఓ సంద‌ర్భంలో అన్నారు. అలాగే సాయిధ‌ర‌మ్‌తేజ్ మల్టీస్టారర్ సినిమాకు తాను ఎప్పుడూ సిద్ధమే అని అంటారు.  వరుణ్ తేజ్, నేను కూడా ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. రవితేజ కూడా అంటూ ఉంటారు… ఇద్దరం కలిసి సినిమా చేద్దామని. అయితే మంచి కథ రావాలి. అప్పుడే మల్టీస్టారర్ చేయవచ్చు. ఇక మ‌రి తేజు ప్లాన్స్ ఏమిటో తెలియాల్సి ఉంది. త‌న త‌ర్వాత చిత్రం మురుగుదాస్‌తోనా లేక ఇంకెవ‌రికైనా క‌మిట్ అయ్యారా అన్న విష‌యం తెలియాలి.

సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్‌ మురగదాస్ తెరకెక్కించిన భారీ చిత్రం దర్బార్‌. రజనీ చాలా కాలం తరువాత పోలీస్‌ అధికారి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.


Leave a Reply

Your email address will not be published.