స‌మోసాగాళ్ళ‌కేం తెలుసు సినిమా గురించి – కంగ‌న‌

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం ‘తలైవి’. ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లె ఈ చిత్ర ప‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్ విడుద‌లైంది. త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కంగ‌న‌ను జ‌య‌ల‌లిత‌గా చూపించ‌డానికి ప్రోస్త‌టిక్స్‌ను ఉప‌యోగించారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్‌కి సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ట్రోల్ జ‌రుగుతుంది. అదేమిటంటే కంగ‌న లుక్ చూడ‌టానికి ఆలుగడ్డలా ఉందని, ఇది జయలలిత బయోపిక్కా లేక స్మ్రతి ఇరానీ బయోపికో తెలియడంలేదని చాలా మంది దారుణంగా ట్రోల్ చేశారు.

అయితే త‌న పై సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన కామెంట్స్ పై కంగ‌న  సోదరి, మేనేజర్ రంగోలీ చందేల్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ పెట్టారు. ‘కళ్లున్నవారు మాత్రమే ఈ ప్రోస్తటిక్స్‌ వర్క్‌ను ఉపయోగించి అద్భుతంగా తీర్చిదిద్దిన పోస్టర్‌ను చూస్తారు. ఇక‌పోతే కంగనకొందరు సమోసా గ్యాంగ్‌కు రాత్రికి పగలుకు తేడా తెలీదు. వాళ్లకు సినిమా గురించి ఏం తెలుసు?’ అని కామెంట్ చేశారు.

కంగన తన చెల్లి కాబట్టి ఎప్పుడూ ఆమెకే సపోర్ట్ చేస్తుంటుంది రంగోలీ. తన చెల్లిని ఎవరైనా ఒక్కమాటన్నా కూడా శివాలెత్తిపోతుంది. మరి ప్రముఖ నటి తాప్సి నటించిన ‘సాండ్ కీ ఆంఖ్’ సినిమా రంగోలీ దారుణంగా కామెంట్ చేశారు. ఈ సినిమాలో తాప్సి 60 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో నటించారు. దాంతో తాప్సిపై రంగోలీ కామెంట్ చేస్తూ.. ‘మొదట ఈ పాత్ర నా చెల్లి కంగనకు వచ్చినప్పుడు తనకు ఒప్పుకోలేదు. వృద్ధురాలి పాత్ర అంటున్నారు కాబట్టి ఇండస్ట్రీలో ఎందరో అలనాటి తారలు ఉన్నారు వారిని తీసుకోండి అని చెప్పింది. కానీ తాప్సీ ఆ పాత్రను దక్కించుకుంది’ అని కామెంట్ చేసింది. మరి రంగోలీ లాజిక్ ప్రకారం.. జయలలిత కూడా వృద్ధురాలే కదా.. మరి అలాంటి పాత్రలో కంగన ఎలా నటించింది? అని పలువురు నెటిజన్లు రంగోలీని ప్రశ్నించారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ  కొన్ని పాత్ర‌ల‌కి కొంద‌రు అలా సూట‌వుతారు అలాగే కంగ‌న కూడా పోస్ట‌ర్ విష‌యం ఎలా ఉన్నా గ‌తంలో ఈమె న‌టించిన మ‌ణిక‌ర్ణిక చిత్రాల‌ను బ‌ట్టి తాను ఈ  పాత్ర‌కు న్యాయం చేస్తుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.