హైదరాబాద్ రాజధాని అమరావతి సెగ

హైదరాబాద్: అమరావతి సెగ హైదరాబాద్ నగరాన్ని కూడా తాకింది. ఇప్పటికే పలువురు అమరావతికి మద్దతుగా హైదరాబాద్లో నిరసనలు కొనసాగించారు. కూకట్పల్లిలో ఆందోళనలు చేపట్టారు. తాజాగా ఏపీ రాజధాని అమరావతికి మద్దతు కోరుతూ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అమరావతి జేఏసీ, విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
జేఏసీ సభ్యులు, విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ఫిల్మ్ ఛాంబర్ వద్ద నినాదాలు చేశారు. అమరావతికి మద్దతు ప్రకటించకపోతే ఏపీలో సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.