జ‌గ‌న్ విష‌యంలో క‌త్తి ప్లేట్ ఎందుకు మార్చాడో

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి నిన్న మెన్న‌టివ‌ర‌కు జైకొట్టిన సినీ క్రిటిక్ అర్ధంత‌రంగా ప్లేటు మార్చారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో చాలా కష్టాల్లో ఉన్నా  రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా నవరత్నాల  అమలుపై జ‌గ‌న్ దృష్టి పెట్టి  ‘అమ్మఒడి’ పధకాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఈ పధకం లో విషయం లో జగన్ పెట్టిన ఆంక్షల పై సినీ విమర్శకుడు కత్తి మహేష్ త‌న మార్కు  విమర్శలు గుప్పించారు. 
నిత్యం జగన్ ఏ పని చేసినా వెన‌కేసుకు వ‌చ్చే కత్తి మహేష్ … గతంలో చంద్రబాబు పాలనల , టీడీపీ హయాంలో కూడా ఒక వర్గం ప్రజల అభ్యున్నతి తీవ్రంగా అడ్డుకున్నారని చెప్పిన కత్తి మహేష్ ఇప్పుడు జగన్ కూడా చంద్రబాబులానే ప్రవర్తిస్తున్నారని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా అమ్మ ఒడి పథకం నిధుల వ్యవహారం పై  చేసిన పోస్టు  సంచ‌ల‌నం సృష్టిస్తోంది  పవన్ కళ్యాణ్ ను మొదలుకొని మోదీ వరకు ఎవరినీ వదలకుండా విమర్శిస్తూ సంచలనం రేపిన కత్తి మహేశ్ అకస్మాత్తుగా ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనుక కూడా ఏదైనా  పెద్ద ప్లాన్ ఉందనే విమర్శలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. 

Leave a Reply

Your email address will not be published.