“దేవుడా నన్ను తీసుకెళ్లిపో. ఈ పాడు సమాజంలో నేను బతకలేనంటూ”……
కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై నందు, ప్రియాంక శర్మ జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో సిద్దమవుతున్న చిత్రం ‘సవారి. సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఓ గుర్రం రోడ్డుపై పరుగెడుతూ తన గురించి చెప్పుకునే సన్నివేశంతో ప్రారంభమయిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగటం విశేషం.
“నా పేరు బాద్షా.. మీ ముందుకు ఓ మంచి కథ తీసుకొచ్చా.. అంటూ రాహుల్ రామకృష్ణ.. గుర్రానికి వాయిస్ అందించడంతో ఈ ట్రైలర్ ఆరంభమైంది. ప్రియాంక శర్మ. “దేవుడా నన్ను తీసుకెళ్లిపో. ఈ పాడు సమాజంలో నేను బతకలేనంటూ” ఏడుస్తు కనిపించడం చూస్తుంటే ఏదో నచ్చని పెళ్లి చేస్తున్నారన్న ఆవేదనని ఆమె వ్యక్తం చేస్తున్నట్టు కనిపించింది. ఖర్ చంద్ర సంగీతంలో వచ్చిన పాటలు అలరిస్తున్న నేపథ్యంలో ప్రియాంకతో ప్రేమ, గుర్రంతో ఉన్న అనుబంధం ఉన్న రాజు ఏం చేసాడన్నదే ‘సవారి’ కథాంశంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు రడీ అవుతున్నారు.