గోడ మీద వార్తలు

01 . బయోడైవర్సిటీ ఘటన మరువక ముందరే హైదరాబాద్ లో మరో బ్రిడ్జి పై నుండి క్రింద పడ్డ మరో కారు – ఒకరు మృతి …
కుర్రకారు స్పీడుని అధికారులు కంట్రోల్ చేస్తారో – జనాలనే కంట్రోల్ చేయమంటారో కనుక్కుంటే సరి …!!
02. కొందరు ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే చూసి ఓర్వలేరు – షన్ద్రబాబు లాంటి వారికి కడుపు మంట – జగన్ …
అంతే- రాజన్న కేంటీన్లలో ఐదు రూపాయలకే పేదలకి బిర్యానీ పెడుతుంటే మసాలా ఘాటుకి కడుపు మంటొక్కొక్కడికీ – లైట్ తీస్కో బ్రో …!!
03. పుట్టిన పిల్లలని బాగా చూస్కునేందుకు భార్యా భర్తలిరువురికీ ఇద్దరికీ చెరో ఏడు నెలలు మెటర్నిటీ లీవులు ఇవ్వాలని నిర్ణయించిన – ఫిన్లాండ్ దేశం …
ఇదే ఇక్కడ పెట్టాలేగానీ – స్వాతంత్రోద్యమ స్థాయిలో సంతానోద్యమం మొదలెడతారేమో మనోళ్ళు .. !!
04. తెలంగాణ ఇంటర్ విద్యార్ధుల పేపర్లని దిద్దడానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ని వాడాలనే ఆలోచనలో – అధికారులు …
మార్కులేసేది మిషనే అయినా దాని మీట నొక్కేది మనిషేరా సామీ – ఒరిజనల్ వాడితేనే అంతంత మాత్రంగా ఉంది – ఇహ ఆర్టిఫిష్యల్ అంటే …??
05. ట్రంప్ పర్యటన సందర్భంగా తక్షణం మురికివాడలని ఖాళీ చేయాలని అక్కడున్న జనాలకి నోటీసులిచ్చిన – అధికారులు …
వార్నీ – గరీభీ హటావో అంటే పేదరికాన్ని పోగొట్టటం అనుకున్నా – పేదలని బయటకి గెంటేయటమా ..??
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!
“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ”
:||: జై హింద్ :||: