ప్రతి హీరోలో ఒక ఆమె!

దేర్ ఈజ్ ఏ HER ఇన్ ఎవ్వెరి HERO అంటూ అదిరిపోయే పోస్టర్ ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేశారు అక్కినేని కోడలు సమంత. ప్రతి హీరోలో ఒక ఆమె! ఎవరో ఒకరు ఉండి తీరాల్సిందేననేది తాత్పర్య ం. సమంత ట్వీట్ చేసిన ఫోటోలో వేరొక అర్థం ధ్వనించింది. ఆయన ఎలానూ హీరోనే కాబట్టి.. ఆ హీరోలోనూ హెర్ అనే నేను ఉన్నాననేది సమంత ఉద్ధేశం కావొచ్చు. అక్కినేని నాగచైతన్య అనే హీరోలో సామ్ అనే ‘హెర్’ ఉన్నారన్నమాట.

 అందుకే మజిలి చిత్రంలో జంటగా నటించారు. మునుముందు కలిసి బోలెడన్ని చిత్రాల్లో నటించనున్నారు జోడీగా.ఆ ఫోటోలో కెప్టెన్ మార్వల్ సూపర్ హీరో బ్రై లార్సన్ అర్థభాగానికి సామ్ అర్థభాగాన్ని కలిపి ఫోటోని షేర్ చేశారన్నమాట.

  సమంత, తమన్నా, కాజల్, రకుల్ చెన్నయ్‌లో ‘కెప్టెన్ మార్వల్’ (పవర్ ఆఫ్ ఉమెన్) సినిమా ప్రచారంలో పాల్గొనేందుకు వెళుతున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. డిస్నీ ఇండియా- మార్వల్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమమిది. అయితే ఆ నలుగురు సౌత్ హీరోయిన్లతో కెప్టెన్ మార్వల్ లాంటి సినిమా ప్లాన్ చేస్తే బావుంటుందేమో!!

Leave a Reply

Your email address will not be published.