రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డా లేక విజయసాయిరెడ్డా?…దేవినేని ఉమ

దొంగ లెక్కలు చూపి, ప‌లు కేసుల‌లో ఏ2 ముద్దాయిగా  జైలు పాలు కూడు తినివ‌చ్చిన విజయసాయిరెడ్డి రాష్ట్రంలో వైపిసి అధికారంలోకి వ‌చ్చాక‌ రాజ్యాంగేతర శక్తిగా మారార‌ని తెలుగుదేశం నేత మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. త‌న నివాసంలో ఆయ‌న మీడియాలో మాట్లాడుతూ… విశాఖ‌లో నివాసం ఏర్పాటు చేసుకుని పులివెందుల పంచాయితీలు చేస్తున్న విజయసాయిరెడ్డిపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌టంలేదో… ఆ దందాల‌లో త‌మ కెంత అందుతోందో సీఎం జగన్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసారు. 

రాజధానిపై ప్రకటన సాయిరెడ్డికి ఉన్న అర్హ‌త ఏమిటి?  రాజ‌ధాని కేబినెట్ ఓ నిర్ణ‌యానికి రాక‌ముందే  విజయసాయిరెడ్డి రాజధాని గురించి ఏ విధంగా ప్రకటన చేస్తారని నిల‌దీసారు. తీసుకునే తప్పుడు నిర్ణయాల్లో ఉన్నతాధికారులు భాగస్వాములు కావ‌ద్ద‌ని,  ఈ ప్రతి నిర్ణయం సీబీఐ విచారణకు వెళ్ల‌టం ఖాయ‌మ‌న్నారు దేవినేని.  సీఎం, మంత్రులకు చెప్పిన దానిపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉండ‌గా… ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి త‌న విశాఖ ప‌ర్య‌ట‌న‌లో ఎందుకు మౌనంగా ఉన్నారో? ఆద‌రాబాద‌రాగా ఎందుకు వ‌చ్చేసారో చెప్పాల‌ని నిల‌దీసారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డా? లేక విజయసాయిరెడ్డా? అన్న అనుమానం జ‌నంలో ఇప్ప‌టికే నెల‌కొని ఉంద‌ని సాయిరెడ్డి నేతృత్వంలో మ‌రిన్ని త‌ప్పుడు లెక్క‌ల‌తో రాష్ట్రాన్ని అత‌లా కుత‌లం చేయ‌టం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని దేవినేని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. 

Leave a Reply

Your email address will not be published.