ఎన్నిక‌ల క‌మిష‌న్ మ‌రోమారు జూలు విదిలించింది.

ఎన్నిక‌ల లో అధికారుల‌పై వేసిన తీరుగానే కేంద్ర మంత్రి , ఎంపీలుచేస్తున్న ప్ర‌చారాల‌ను త‌ప్పు ప‌డుతూ వారిపై వేటు వేయాల‌ని బిజెపికి సిఫార‌సు చేయ‌టం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.
భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఈనెల 27న రితాలలో జరిగిన ఎన్నిక‌ల ప్ర‌చార‌ బహిరంగ సభలో సిఎఎని వ్య‌తిరేకిస్తున్న వారిని దేశ ద్రోహులుగా చిత్రీక‌రిస్తూ, ‘దేశద్రోహులను కాల్చిచంపండి’ అంటూ నినాదాలు చేసి ఠాకూర్ వ్య‌వ‌హారం పై సీరియ‌స్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఠాకూర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, ఈనెల 30వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. 
అలాగే ప్ర‌జ‌ల ఇళ్ల‌లోకి చొర‌బ‌డి అక్కాచెల్లెళ్లు, కూతుళ్లపై అత్యాచారాలు, హత్యలు చేయవచ్చుఇప్పుడే ప్రజలు మేల్కోవాలి  బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వీరిరువురిని బిజెపి ప్ర‌చార క‌మిటీ నుంచి తక్షణం తొలగించాలని ఎన్నికల సంఘం బుధవారంనాడు ఆదేశించ‌డంతో క‌మ‌ల నాధుల‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత కాలం త‌మ‌కు ఈసి అండ‌గా నిలుస్తున్నట్టు భావిస్తున్న బిజెపినేత‌లు ఈసి తీరుతో ఖంగు తిన్నారనే చెప్పాలి. మ‌రి బిజెపి అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.