రాజధాని కోసం రైతుల ఆందోళనలు

రాజధాని కోసం రైతుల ఆందోళనలు ఉదృతమవుతున్నా ప్రభుత్వం మెండి పట్టువీడడం లేదు. అమరావతి కోసం ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏపీ సీఎం జగన్ వైఖరీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిని తరలించొద్దంటూ రైతులు చేస్తున్న దీక్షలు 53వ రోజుకు చేరాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడిలో రైతుల ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో రవి, శ్రీకర్ చేపట్టిన 151 గంటల నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. స్థానిక వైద్య సిబ్బంది ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. 53 రోజులుగా పలు పద్ధతుల్లో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. కాగా మేడారం జాతర సందర్భంగా అమరావతి రైతులు సమ్మక్క, సారలమ్మ మొరాను వినిపించేందుకు రైతులు మేడారం బయలు దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ‘జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి’ అంటూ రైతులు నినాదాలు చేశారు.