వెంకీతో జోడీ క‌డుతున్న ప్రియ‌మ‌ణి?

భూ వివాదం నేపథ్యంలోత‌మిళంలో తెరకెక్కిన ‘అసురన్‌’ చిత్రంలో వెంక‌టేష్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ధనుష్‌ కథానాయకుడిగా న‌టించిన ఈ చిత్ర రీమేక్ హ‌క్కులు తీసుకున్నప్ర‌ముఖ‌ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్ తెలుగు నెటీవిటీకి అనుకుణంగా ప‌లు స‌న్నివేశాల‌ను మార్పు చేస్తోంద‌ని స‌మాచారం.  ‘అసురన్‌’ చిత్రంలో కీలకమైన ధనుష్‌ సతీమణి మంజువారియర్‌ పాత్రలో గ‌తంలో వెంకటేశ్‌కు జంటగా శ్రియా న‌టిస్తోంద‌ని ఊహాగానాలు వినిపించాయి.

కాగా ఇప్పుడు ప్రియ‌మ‌ణిని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వెంక‌టేష్‌- ప్రియ‌మ‌ణి జంట‌గా ఇప్ప‌టివ‌ర‌కు తెర‌మీద క‌నిపించ‌క‌పోవ‌టంతో ఈ చిత్ర ద‌ర్శ‌కుడు  శ్రీకాంత్‌ అడ్డాల చేసిన ప్ర‌తిపాద‌న‌కు నిర్మాత సురేష్ బాబు సై అన్న‌ట్టు స‌మాచారం. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నుంచి  ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలవడకున్నా ఫిలిం న‌గ‌ర్‌లో మాత్రం  ప్రియమణి పేరు బ‌లంగా వినిపిస్తోంది.  మ‌రి వెంకీ స‌ర‌స‌న శ్రీయా, ప్రియ‌మ‌ణిల‌లో ఎవ‌రికి ఛాన్సు దొర‌క‌నుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.