సుకుమార్ విడుద‌ల చేసిన “మథనం” ట్రైల‌ర్‌


శ్రీనివాస సాయి,  భావన రావులు జంట‌గా  అజయ్ మణికందన్ దర్శకత్వంలో వ‌స్తున్న  “మథనం”  చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో వైభ‌వంగా జరిగింది. కాశీ ప్రొడక్షన్స్ పతాకంపై దివ్యప్రసాద్, అశోక్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం రియలిస్టిక్ కథాంశంతో లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన న‌ట్టు ద‌ర్శ‌కుడు చెప్పారు. 
 బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్యఅతిధిగా హాజరై మథనం ట్రైలర్ ని లాంచ్ చేశారు.. ఈ కార్యక్రమంలో సూపర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, హీరో  శ్రీనివాస సాయి, హీరోయిన్ భావన రావు, నటులు అజయ్ గోష్, రవి ప్రకాష్, సుభాష్, దువ్వాసి మోహన్, నటి హేమ, నిర్మాత దివ్య ప్రసాద్, దీప, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరామెన్ పిజి విందా, లిరిక్ రైటర్ పూర్ణచారి, తానా ప్రెసిడెంట్ సతీష్ వేముల, సెక్రటరీ రవిపోతుల, చిత్ర నిర్మాత అశోక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రం ఇండియాలో రిలీజ్ అవకుండా ఫస్ట్ టైం యు ఎస్ లో డిసెంబర్ 6న విడుదల కావడం విశేషం..ఆ తర్వాత ఇండియాలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.  

Leave a Reply

Your email address will not be published.