లెస్బియ‌న్ల‌ను స‌మాజం అంగీక‌రించాలి -రెజీనా

రెజీనా కసాండ్రా తెలుగు, త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈమె క‌న్ను ప్ర‌స్తుతం తాజాగా బాలీవుడ్ పై ప‌డింది. వచ్చిన అవ‌కాశాల‌ను అందుకుంటూ తన అదృష్టాన్ని ప‌రీక్షించుకునే రెజీనా బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ కపూర్‌తో క‌లిసి `ఏక్‌ లడకీ కో దేఖాతో ఐసా లగా` అనే లెస్బియ‌న్ ల‌వ్‌స్టోరీ సినిమాలో న‌టించింది.

ఈ సినిమాలో రెజీనా, సోన‌మ్‌లు ప్రేమికురాండ్రుగా క‌నిపించారు. తాజాగా రెజీనా ఈ సినిమా గురించి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ… తాను ద‌క్షిణాదికి మాత్ర‌మే ప‌రిమితం అవ్వాల‌నుకోవడం లేదనీ, అన్ని భాష‌ల్లోనూ న‌టిస్తాననీ, న‌టిగా ఎలాంటి పాత్ర‌లో పోషించేందుకైనా సిద్ధ‌మని చెప్పేందుకే లెస్బియ‌న్‌గా న‌టించ‌డానికి కూడా వెనుకాడ‌లేదని పేర్కొంది.అయినా అందులో త‌ప్పేం ఉంది, సుప్రీంకోర్టు కూడా అంగీక‌రించింది, మ‌నం 21వ శ‌తాబ్దంలో ఉన్నాము ఎవ‌రు ఎలా కావాలంటే అలా జీవించే స్వేచ్ఛ ఉంది. లెస్బియ‌న్ల‌ను స‌మాజం కూడా అంగీక‌రించాలని అంది.

Leave a Reply

Your email address will not be published.