ఫిలిం ఇండస్ట్రీ కి మరో కొత్త వారసురాలు.. ఎవరో తెలుసా ?.

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వార‌సుల హ‌వా న‌డుస్తోంది. అయితే వార‌సులుగా అమ్మాయిలు రావ‌టం చాలా అరుదుగా జ‌రిగే విష‌యం. అయితే తాజాగా  ‘మా పల్లెలో గోపాలుడు, జెంటిల్‌మెన్, ఒకే ఒక్కడు త‌దిత‌ర సూపర్ సక్సెస్‌పుల్ చిత్రాలతో హీరోగా తెలుగు ప్రేక్షకులల మ‌దిలో ప్ర‌త్యేక స్ధానం అందుకున్న నటుడు అర్జున్ సర్జా.  న‌టుడిగా, హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన అర్జున్  ఇప్ప‌డు త‌న  పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ ని  టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం చేయనున్నారు. 

ఇదే విష‌యం త‌మిళ ప‌రిశ్ర‌మలో తెగ వైర‌ల్ కాగా,    నేడు (ఫిబ్రవరి 10) ఆమె పుట్టిన రోజు సంద‌ర్భంగా అర్జున్ స‌న్నిహిత వ‌ర్గాలు ఈ విష‌యం ఖ‌రారు చేసాయి.ప‌లు దేశ భ‌క్తి చిత్రాల‌లో న‌టించిన అర్జున్ ఇదే త‌ర‌హా స‌బ్జెక్టుని ఎంచుకుని స్వీయ  దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ట్టు స‌మ‌చారం.  ఈ చిత్ర పూర్తి వివరాలు త్వరలో అర్జున్ నేరుగా మీడియా ముందుకు వ‌చ్చి ప్రకటించనున్నారని తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published.