Untitled Post
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం తెల్లవారుజామునే ఆలయ ఉత్తర ద్వారాలు తెరుస్తామని టీటీడీ ప్రకటించింది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి సామని, అనేక జాగ్రత్తలు తీసుకున్నామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాకు చెప్పారు. ఆదివారంఆయన తన కార్యాలయంలో మీడియాలో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 06వ తేదీ సోమవారం ఉదయం ధనుర్మాస కైంకర్యాల తరువాత ఉదయం 2 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం అవుతుందని, ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీలను తొలుత దర్శనానికి అనుమతించి ఆపై ఉదయం 5 గంటల నుండి సర్వదర్శనంలో ఉండే భక్తులను అనుమతిస్తామని, ఆపై వీఐపీలతోపాటు సామాన్య భక్తులు మహాలఘు దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని ఈవో స్పష్టం చేశారు.