రేపటి నుంచి పెరగనున్న బస్సు ఛార్జీలు..

తెలంగాణ వ్యప్తంగా బస్సు ఛార్జీలు మంగళవారం నుంచి పెరగనున్నాయి. కిలోమీటరుకు 20 పైసలు పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం నుండే ఈ ధరలు పెరగనున్నాయని ప్రభుత్వం తొలుత ప్రకటించిన టికెట్ల విషయంలో చిల్లర సమస్యలు, కనీస ఛార్జీలు లాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి సోమవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇప్పటికే 52 రోజుల సమ్మెతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్న ప్రజలకు మంగళవారం బస్సు ఛార్జీలు పెంచనుండడంతో తీవ్ర భారం పడనుంది.