జగన్మోహన్ రెడ్డికి మంత్రి కొల్లు రవీంద్ర బహిరంగ లేఖ
విద్యాసంస్థల విభజనపై ప్రతిపక్ష నాయకుడు ఎందుకు మాట్లాడరు..అని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు జగన్ మోహన్ రెడ్డి కి బహిరంగ లేఖ రాస్తూ తనప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్
టీఆర్ ఎస్తో అంటకాగుతూ ఆంధ్రప్రదేశ్ యువతకు ద్రోహం చేస్తున్నారు..
ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకంపై సుప్రీం తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు
తెలంగాణలో స్థిరపడిన వారికి ఫీజులు చెల్లిస్తానని మోసం చేసిన కేసీఆర్‌ను జగన్ ఏనాడైనా ప్రశ్నించారా?
షెడ్యూల్ 10లోని 21కిపైగా విద్యా సంస్థల విభజనపై అన్యాయం చేసిన కేసీఆర్‌తో జగన్మోహన్రెడ్డి అంటకాగడం దేనికి సంకేతం?
గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వూలు అవసరం లేదని కేంద్రం చెప్పినప్పటికీ వినకుండా మొండిగా ఇంటర్వూలు నిర్వహించి ఏపీకి చెందినవారికి ఒక్కరికి కూడా ఉద్యోగం రాకుండా చేసినా మీరు నోరు మెదిపారా?
ఉమ్మడి ఆస్తులను ఏకపక్షంగా స్వాధీనం చేసుకుని ఏపీ ప్రయోజనాలను కేసీఆర్ దెబ్బతీస్తే.. ఎందుకు వేలెత్తి చూపలేకపోయారు?
తెలంగాణ విద్యార్థుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోదరభావంతో వ్యవరిస్తున్నా తెలంగాణ మాత్రం శత్రుభావంతో వ్యవహరిస్తూ ఆంధ్రావాళ్లని దెబ్బతీస్తోంది వాస్తవం కాదా?
ఆంధ్రప్రదేశ్‌పై, ఇక్కడి ప్రజలపై ద్వేషంతో విద్యార్థులను తీవ్రంగా నష్టపరిచినా ఏనాడూ జగన్ స్పందించలేదు. ముందు విద్యార్థులకు జగన్ క్షమాపణలు చెప్పాలి అని ఆయన తన బహిరంగ లేఖ ద్వారా ప్రశ్నించారు .