మహేష్ బాబు సినిమా లోనే కాదు దీంట్లో కూడా ప్రిన్సే

టాలీవుడ్ లో బాల న‌టుడిగా సూపర్ స్టార్ కృష్ణ వార‌సుడిగా అడుగు పెట్టిన మహేశ్ బాబు  త‌న‌దైన మార్కు సినిమాలతో 

న‌ట‌వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తున్నాడు.  మ‌హేష్‌ సినిమా రిలీజ్ అవుతోందంటే బాక్సాఫీస్ బద్ధలవ్వాల్సిందే అన్న రేంజ్‌లో అభిమానులు ఆత‌ని సినిమాల‌కు నీరాజ‌నాలు ప‌డుతుంటారు.  అందుకే  తెలుగు సినిమాల‌ను రేంజ్‌ని పెంచేస్తున్న‌ హీరోల్లో సూపర్‌స్టార్ మహేష్ బాబుది చాలా ప్రత్యేక స్థానమని అభిమానులు  అంటారు.   ప్రిన్స్‌గా స్క్రీన్స్ మీద‌కు వ‌చ్చి హ‌ల్‌చ‌ల్ చేస్తున్న మ‌హేష్ ఇక  సౌతిండియాలో కింగ్ గా మారిపోయాడు.

ఇది సినిమాల‌ విషయంలోనే కాదు… వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌లో ఏకంగా  22 బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయ‌టం విశేషం. థమ్సప్, సంతూర్, శ్రీ సూర్య డెవలపర్స్, రాయల్ స్టాగ్ ఇలా  చాలానే ఉన్నాయ్.  ఇప్పుడు ద‌క్షిణాదిన  ఏదైనా  కంపెనీ వాణిజ్య ప్ర‌క‌ట‌న చేయాలంటే ముందు  మహేశ్ వైపే తొంగి చూస్తున్నాయి.  బ్రాండెడ్ కంపెనీలతో పాటు రియ‌ల్ వెంచ‌ర్లకు మొదటి చాయిస్‌ మహేశ్ బాబే క‌నిపిస్తున్నాడు. దీంతో ప్ర‌కటనల్లోనూ మహేశ్ బాబే కింగ్ అన్న మాట య‌దార్ధ‌మ‌ని ఒప్పుకుంటారా? మ‌రి. 

Tags:  maheshbabu , prince ,cinema news ,

Leave a Reply

Your email address will not be published.