స్పష్టమైన ప్రకటన చేసేవరకు ఆందోళనలు ఆగవుతెలుగుదేశం భిక్షతో కొడాలి నాని ఎదిగారని, అలాంటి పార్టీపైనే దాడులకు దిగితే పుట్టగతులు ఉండవని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కొడాలి నాని,  జగన్ మొసలి రూపంలో ఉన్న మనిషి లాంటి వారని,  ఇలాంటి వారితో సమాజానికి ప్రమాదకరమన్నారు. నాని నీగత చరిత్ర ఎవరికీ తెలియదు. ఇప్పుడు టైం బాగుండి మంత్రి అయినంతా మాత్రాన నీ చర్రిత పునీతం కాదు.  ఇప్పటికైనా నీ భాషను మార్చుకో.. లేకపోతే ప్రజలు గుణపాఠం చెపుతారన్నారు.

 వైసీపీ ప్రభుత్వం రాజధానిపై తీవ్ర గందర గోళం సృష్టిస్తోందన్నారు. అమాయకులైన రైతులపై తప్పుడు కేసులు పెడుతూ వారిని ఆత్మహత్యలు చేసుకునేలా ప్రభుత్వం చేస్తుందన్నారు. రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేసేవరకు ఆందోళనలు ఆగవన్నారు. పోలీసుల తీరుతో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారన్నారు.

 విశాఖలో భూములు కాపాడుకోవడానికే రాజధానిని అక్కడ ప్రకటించి రాజకీయం చేస్తోందన్నారు. అమరావతిని రాజధాని చేస్తామంటే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని ఇప్పుడు రాజధానిని మారిస్తే వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published.