బీరు తాగితే పొట్ట తగ్గుతుందట….

చాలా మందికి కుర్రతనంలోనే పొట్టపెరగటం ఆరంభిస్తుంది. కొందరు తినే ఆహారం దీనికి కారణం కాగా, మరికొందరు తనకు వారసత్వంగా వచ్చిందంటూ తెగ మురిసిపోతుంటారు. అయితే ఈ పొట్ట కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నవారూ లేకపోలేదు. బొజ్జతో బయట తిరగలేకున్నామని మధనపడే వారూ ఉన్నారు.
అయితే మీ పొట్టని తగ్గించే మార్గం బీరులో ఉందంటోంది ఆమ్స్టర్డామ్ యూనివర్శిటీ లో బ్యాక్టీరియా నిపుణుడి సారధ్యంలో పనిచేసిన అధ్యయన బృందం. రోజుకో బీరు తాగండి.. మీరు రోజూ ఓ బీరు తాగడం వల్ల పొట్ట కరిగిపోవడమే కాకుండా సుఖవంతమైన నిద్ర పడుతుందపి ఆమ్స్టర్డామ్ యూనివర్శిటీ లో బ్యాక్టీరియా నిపుణుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎరిక్ క్లాసెన్ తను నిర్వహించిన అధ్యయనం విషయాలను వెల్లడిస్తూ…
బీరులో ఉన్న మంచి గుణాలున్నాయట. వీటిలో ఒకరకమైన బ్యాక్టీరియా, ఈస్ట్ మిశ్రమం ఉండడమే అందుకు కారణమని అయితే అన్ని బీర్లలో ఈ గుణం ఉందో, లేదో తెలియదుగానీ బెల్జియంకు చెందిన హోగార్డెన్, వెస్ట్మల్లే ట్రిపల్, ఎట్ క్రైకెన్బియర్ బ్రాండ్ల బీర్లలో ఈ మంచి గుణాలు ఉన్నాయట. ఆ బీర్లు రెండుసార్లు, భూగర్భంలో ఉండగా ఒకసారి, సీసాలో మరోసారి బీరు పులియడం వల్ల వాటికి ఆ మంచి గుణాలు వస్తాయని వెల్లడించారు.