వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు ఉపరాష్ట్రపతిని టార్గెట్ చేస్తున్నారా .. !

సామాజిక మీడియా పుణ్యమా అని ఎవరు నచ్చకున్నామన మనసులో ఉన్న
కల్మషమంతా వాళ్లపై కక్కేసుకునే గోడలు చాలా నే దొరుకుతున్నాయి. నెట్
ఓపెన్ చేస్తే చాలు బూతుల రాతలు దర్శనమి స్తున్నాయి. ఈ క్రమంలోనే
ఇప్పుడు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కూడా వదలటం లేదు కొందరు
నెటిజన్లు. రాజకీయాలనుంచి బైటకు రావాలని లేకున్నా అనూహ్యంగా అందుకున్న
ఉపరాష్ట్ర పతి పదవి చాన్నాళ్లు వెంకయ్యనాయుడుకి బంధనాలే వేసిందని
చెప్పాలి. కారణం ఈ పదవి దేశంలోనే అత్యున్నత రెండో పదవి కావటంతో పాటు ఆ
పదవిలో వున్నవాళ్లు ఆచితూచి మాట్లాడాల్సిఉండటం ఓ కారణం కావచ్చు.ఇలాంటి
రాజ్యాంగ పదవిలో వున్నవాళ్లు వివాదాస్పద అంశాల్లో సాధ్యమైనంత వరకు
అభిప్రాయాలు బహిరంగంగా పంచుకోకూడదని చాలా మంది చెపుతారు. అయితే దేశానికి
ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడుగారికి ఈ సూత్రం తెలియని వ్యక్తి కాదు
కదా? తనలోని భావోద్రేకాలను ఆయన ఎప్పుడూ ఆపుకోలేక దు. తనదైన
ప్రాసలతో ఇప్పటికీ తన నుండి విడువని రాజకీయనాయకుడు అప్పుడప్పుడూ
బైటకు వస్తుండటంతో మాటల తూటాలు పేలుస్తూనే ఉంటారు.
ఆమధ్య ఏపిలో
ఇంగ్లీష్ మాద్యమం మాతృభాషలో విద్యాబోధనల విషయంలో తనదైన అభిప్రాయాల్ని
నిర్మొహమాటంగా వెంకయ్యనాయుడు వ్యక్తపరిచడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన
రెడ్డి తో పాటు సహచర మంత్రులకూ ఎక్కడో కాలి చిర్రెత్తుకొచ్చి, తన
పిల్లలు ఏ మీడియం లో చదివారంటూ నిలదీతలు ఆరంభించారు. దీంతో ప్రధానమంత్రి
కూడా రంగంలోకి దిగి మాతృ భాషలో విద్యాబోధన ఎంత ఆవశ్యకతో అని చెప్పడంతో
అధికార వైసిపి నేతలు దానిని దాటవేసారు. ఉపరాష్ట్ర పతి పదవిలో ఉన్నంత
మాత్రాన రాష్ట్రంలో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటే ఆ పదవిలో
వున్నంతకాలం నోరు మెదపకుండా ఉండాలని కొందరు సామాజిక మీడియాలో
సూచనలిస్తుండటం, చర్చనీయాంశంగా మారింది. తాజాగా మూడు రాజధానులపై
స్పందించిన వెంకయ్య తన అభిప్రాయం వ్యక్తపరిచ డం పట్ల కూడా ఒక
రాష్ట్ర ముఖ్యమంత్రి విధానపర నిర్ణయంపై ఉపరాష్ట్రపతి స్థాయిలో వున్న
వ్యక్తి ఎలా ప్రశ్నిస్తాడంటూ వైసిపి వర్గాలు ఆగ్రహావేశాలు వ్యక్తం
చేస్తున్నాయి. ఇదే అంశంపై సామాజిక మీడియాలోనూ వైసిపి వర్గాలు ట్రోల్
చేస్తున్నాయి. పాలనా వికేంద్రీకరణకి, అధికార వికేంద్రీ కరణకి తేడా
తెలియని వాళ్లంతా ఉపరాష్ట్రపతిని ఆడిపోసుకుంటున్నట్టు
కనిపిస్తోందని, వీళ్లు కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా అన్న విమర్శలు
వెల్లువెత్తుతున్నాయి.