ఇద్ద‌ర‌మ్మాయిల‌తో హీరో స‌ర‌సం… అబ్బా ఎంత హాట్ గురూ…?

ఈ మ‌ధ్య బోల్డ్ కంటెంట్, బోల్డ్ సీన్స్‌తో సినిమాలు రావ‌డం ప్ర‌జంట్ ట్రెండ్‌గా మారింది. బోల్డ్ సీన్స్‌తోనే క‌లెక్ష‌న్లు కొట్టేయాల‌నుకుంటున్నారు కొంద‌రు నిర్మాత‌లు. ఇప్పుడు ఒక స్టార్ హీరో ప్లే బాయ్ పాత్ర‌లో న‌టించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఒక‌టే మంచం మీద ఇద్ద‌ర‌మ్మాయిల‌తో రాస‌లీల‌లు చేస్తూ దొరికిపోయిన ఆయ‌న‌గారి వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇంతకీ ఎవరా స్టార్ హీరో? ఏమిటా రొమాన్స్ అనుకుంటున్నారా…?  బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని హీరో. ప్లేబోయ్ వేషాలకు అతడు కేరాఫ్ అడ్రెస్ అనే చెప్పాలి. `లవ్ ఆజ్ కల్` (తెలుగులో తీన్ మార్) లాంటి ప్రేమకథా చిత్రంతో యూత్ లో ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్న స్టార్ అతడు. ప్రస్తుతం సైఫ్ నటిస్తున్న `జవానీ జానేమన్` మరో రొమాంటిక్ కథాంశంతో వస్తోంది. టబు – అలియా ఫర్నిచర్ వల్లా ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 7 న విడుదలకానున్న ఈ చిత్రం తేదా మారి 31 జనవరి 2020 న కొంత అడ్వాన్స్ డ్ గానే థియేటర్ల లోకి రానుంది. తాజా గా నిర్మాతల్లో ఒకరైన జాకీ భగ్నాని మొదటి పోస్టర్ ను షేర్ చేస్తూ.. కొత్త తేదీని ప్రకటించారు. ఈ పోస్టర్ లో ప్లేబోయ్ సైఫ్ ఇద్దరు మగువలతో మంచంపై పడుకుని ఉన్న దృశ్యం వేడెక్కిస్తోంది. ఇక సైఫ్ మెడలో ప్లేబాయ్ లాకెట్టు వేలాడుతోంది. ఈ దృశ్యం చూస్తుంటే ఇందులో రొమాన్స్ పీక్స్ లో ఉండనుందని అర్థమవుతోంది.ఇక ఈ చిత్రంతోనే పూజా బేడి కుమార్తె అలియా ఫర్నిచర్ వల్లా పరిచయం అవుతోంది. తను సైఫ్ కుమార్తె గా నటిస్తోంది. జవానీ జానెమన్ను సైఫ్ బ్యానర్ బ్లాక్ నైట్ ఫిల్మ్స్- నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్ – పూజా ఎంటర్ టైన్ మెంట్ (జాకీ భగ్నాని) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రి-కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందించిన చిత్రమే అయినా రొమాన్స్ ప్లేబోయ్ యాక్టివిటీని రివీల్ చేయడం ద్వారా టీమ్ ఉత్కంఠను పెంచింది.

Leave a Reply

Your email address will not be published.