పుత్రోత్సాహం లో కృష్ణ …

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘ సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేశారు. సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకొని.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ కూడా బ్లాక్ బస్టర్ కా బాప్ అని పేరు కూడా ప్రకటించింది. అయితే ఈ చిత్రం పైన సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ సరిలేరు నీకెవ్వరు సినిమా గురించి మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్రనిర్మాతల్లో ఒకటైనా ఏకే ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
సినిమా గురించి కృష్ణ మాట్లాడారు. ” సరిలేరు నీకెవ్వరు చిత్రం ఈ రోజు బ్లాక్ బస్టర్ అయింది. ప్రొడ్యూసర్, దర్శకుడు ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ కా బాప్ అని పబ్లిసిటి ఇవ్వడం చాలా బాగుందన్నారు. దర్శకుడు సినిమాని ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా తెరకెక్కించారు. ఇక నిర్మాతలు కూడా ఎక్కడ కూడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు” అని కృష్ణ చెప్పుకొచ్చారు. ఈ సినిమా మరింత విజయాన్ని అందుకుంటుందని అన్నారు.
సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు ఆర్మీ రోల్ లో కనిపించారు. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ భారతీగా లేడీ అమితాబ్‌ విజయశాంతి పవర్‌ఫుల్‌ పాత్రలో నటించారు. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు సినిమాని నిర్మించారు. ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది.
ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్‎ని మహేష్ బాబు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమాని చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్‎లో మహర్షి సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాల్లో హీరోయిన్ గా కీయరా అద్వానీ నటిస్తుందని సమాచారం. పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమా చేయనున్నాడు మహేష్ బాబు.

Leave a Reply

Your email address will not be published.