చివ‌రికి ఈ నంద‌మూరి హీరో ఏమ‌వుతాడో?వాస్తవానికి కళ్యాణ్ రామ్ సినిమాలు హిట్ అయినవి అన్ని కథలే. క‌థ‌లో బ‌లం ఉన్న వాటినే ఎన్నుకుంటాడు క‌ళ్యాణ్ రామ్ ఈ సారి నటన లో చూడాలి. అంత మంది హీరోల మధ్యలో కళ్యాణ్ రామ్ సినిమా అంటే వసూళ్లు వచ్చే అవకాశం తక్కువ. ఆ సినిమాలకు దొరక్కపోతే ఈ సినిమా చూస్తారు.
ఇంత మంది పోటీలో ఉన్నా కూడా క‌ళ్యాణ్ ఏ ధైర్యంతో బ‌రిలోకి దిగుతున్నారో చాలా మందికి అర్ధం కావ‌డం లేదు. ఏమాత్రం బ‌న్నీ చిత్రంగాని, మ‌హేష్ చిత్రంగాని హిట్ అయితే క‌ళ్యాణ్‌రామ్ సినిమా హిట్‌కాదుక‌దా థియేట‌ర్స్ దొర‌క‌డం కూడా కాస్త క‌ష్ట‌మ‌నే చెప్పాలి. అయినా కూడా క‌ళ్యాణ్‌రామ్ ఎంతో కాన్ఫిడెంట్‌గా బ‌రిలోకి దిగుతున్నారంటే ఒక‌ర‌కంగా ఆయ‌న‌కున్న ధైర్యాన్ని మెచ్చుకోవ‌ల‌సిందే.

ఇక క‌థ విష‌యానికి వ‌స్తే సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం. ఇందులో కళ్యాణ్ రామ్ కి జంట‌గా మెహరీన్ న‌టిస్తోంది. టి ఎన్ ఆర్, తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, అన్నపూర్ణమ్మ, సుధర్శన్, భద్రం, సుభలేఖ సుధాకర్, పవిత్ర లోకేష్  తదితరులు నటించారు.  ‘శతమానం భవతి’ సినిమా ఫేమ్ సతీష్ వేగేశ్నదర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణ ప్రసాద్, ఆదిత్య మ్యూజిక్‌తో కలిసి నిర్మించారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించారు.  సినిమా ‘ఎంత మంచివాడవురా’. కుటుంబ కథా చిత్రాలను ఎంతో హృద్యంగా తెరకెక్కించే సతీష్ , ఈ సినిమాను కూడా ఒక మంచి పాయింట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో జరుగనున్న ఎంత మంచివాడవురా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా వస్తున్నారని వారు తమ ప్రకటనలో తెలిపారు. దానితో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి అనే చెప్పాలి. గోపి సుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు రాజ్ తోట ఫోటోగ్రఫిని అందిస్తుస్తున్నారు. చివ‌ర‌గా చూద్దాం ఆయ‌న ఎంత మంచివాడు అనిపించుకుంటాడో.

Leave a Reply

Your email address will not be published.