‘దటీజ్ మహాలక్ష్మి’


మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం క్వీన్ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ఆకట్టుకుంది. దీంతో మరోసారి కంగన నటించిన పాత్రలో తమన్నా ఏ మేరకు న్యాయం చేస్తుందో అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రంలో తమన్నా పదహారణాల తెలుగమ్మాయి పాత్రలో నటించడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ చెబుతోంది. ప్రతిష్టాత్మక ఐఫిల్ టవర్ నేపథ్య ంలో ఈ కథ సాగుతుంది. అమాయకంగా ఉండే ఓ అమ్మాయి.. జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల వల్ల ఎలా శక్తివంతమైన మహిళగా మారుతుంది? అనేదే ఈ సినిమా కథాంశం. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. త్వరలోనే అన్నిపనులు పూర్తి చేసి రిలీజ్ చేయనున్నారు. మైఖెల్ ట్యాబ్యురియస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. టైజాన్ ఖొరాకివాలా సినిమాను సమర్పిస్తున్నారు. మెడైంటే ఇంటర్నేషనల్ బ్యానర్ పై మను కుమరన్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. తమన్నాను ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్స్ రాజీవ్ మసంద్, అనుపమ్ చోప్రా ఇంటర్వ్యూ చేసి సినిమా ప్రమోషన్ ను ఘనంగా మొదలు పెట్టారు. నటి పరుల్
యాదవ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published.