శ్రియని లండ‌న్‌ పోలీసుల‌కి దొరికిపోయిందా…?


తెలుగులో మాత్రమే కాదు అన్ని భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించింది అందాల భామ శ్రియ. అయితే ఈ మధ్య శ్రియ ఎక్కువగా కనిపించడం లేదు. ఆమె తెలుగులో  నటించిన ఆఖ‌రి చిత్రం ’వీర భోగ వసంత రాయులు’. అయితే ఓ విదేశి కుర్రాడ్ని శ్రియ చాలా కాలంగా ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది.

దాంతో ఆమె సినిమాలను బాగా తగ్గించేసింది. ఇది పక్కనపెడితే శ్రియను తాజాగా లండన్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్ద చర్చకు దారి తీసింది. ప్రస్తుతం శ్రియ `సందకారి` అనే తమిళ సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ లండన్ లో ఓ షెడ్యూల్ ను ప్లాన్  చేయడంతో యూనిట్ అంతా అక్కడకి వెళ్లింది. అయితే అక్కడి ఎయిర్ పోర్ట్ లోని ఓ హై సెక్యురిటీ ప్రాంతంలోకి శ్రియ అనుమతి లేకుండా వెళ్లిందట. దాంతో ఆమెని అక్కడి పోలీసులు గన్ పాయింట్ లో పట్టుకున్నట్లు సమాచారం.

అక్కడే షూటింగ్ జరుగింది కదా అని.. సరదాగా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూడటం కోసం వెళ్లిన శ్రియ ఇలా ఇరుక్కుంద‌ట. అయితే వెంటనే విషయం తెలుసుకున్న సినిమా యూనిట్ సభ్యులు వెళ్లి పోలీసులతో మాట్లాడారట. ఆ టైంలో డాక్యుమెంట్స్ చూపిస్తేనే కానీ పోలీసులు శ్రీయను వదిలిపెట్టలేదట. లండన్ పోలీసుల నుంచి ఊహించని పరిస్థితి ఎదురు కావడంతో శ్రీయ ఓ రకమైన షాక్‌లోకి వెళ్లిపోయింది.

Leave a Reply

Your email address will not be published.