ప్రభుత్వ పాఠశాలలో ట్రంప్ సతీమణి బిజి బిజీ

భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ ఓ వైపు అధికారిక పనుల్లో బిజీగా ఉండగా… ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ట్రంప్ సతీమణి మెలానియా దక్షిణ మోతీ బాగ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘హ్యాపీనెస్ క్లాస్’ సమావేశానికి హాజరై చిన్నారులతో కలసి సందడి చేసారు. ఈ సందర్భంగా సర్వోదయ కో-ఎడ్యుకేషనల్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు రంగు, రంగుల చీరలు, ‘ఘగ్రా-చోలి’ వంటి సంప్రదాయ దుస్తులను ధరించి, సంగీత వాయిద్యాలతో మెలానియాఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా “పుస్తకాల నిధిలోకి స్వాగతం ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.”అని రాసి ఉండటాన్ని ఆనందంగా తిలకించారు. అలాగే మరొక తరగతిలో “మెలానియా ట్రంప్ ను మా హ్యాపీ వరల్డ్‌కు స్వాగతిస్తున్నాము” చూసి ముచ్చటపడ్డారు. తదుపరి పాఠశాలలో జరిగిన ‘హ్యాపీనెస్ క్లాస్’లకు హాజరై ఇందులో భాగంగా విద్యార్థులకు ధ్యానం, వీధి నాటకాలు, పిల్లలలో ఆందోళన మరియు ఒత్తిడి స్థాయిలను తగ్గించే లక్ష్యంతో ప్రాథమిక విధేయత వంటి వివిధ కార్యక్రమాలు నేర్పుతున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమానికి హాజరై బాలీవుడ్ సంగీతానికి నృత్యం చేసే పిల్లలతో కలిసి కాసేపు గడిపారు.