క‌మ‌లంతో క‌ల‌సి న‌డిచేందుకు ప‌వ‌న్ ఓకే?


ఏపీలో కొత్తగా రాజకీయ సమీకరణాలకు తెర లేచింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో సమావేశమై రాష్ట్రంలోని అనేక రాజ‌కీయ, సంస్ధాగ‌త స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. రెండ్రోజుల క్రితం  అమరావతిలోని జ‌న‌సేన పార్టీ కార్యాలయంలో  ముఖ్య నేత‌ల‌తో స‌మావేశ‌మై రాజ‌ధాని, రాష్ట్ర రాజ‌కీయాల‌పై చ‌ర్చిస్తున్న స‌మ‌యంలోనే  ఢిల్లీ  నుండి బిజెపి పెద్ద‌లు ఫోన్ చేయ‌టంతో హుఠాహుఠిన బ‌య‌లు దేరిన విష‌యం విదిత‌మే. 

పవన్..నాదెండ్ల మనోహర్  రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ ఆరెస్సెస్ నేతలతో అనేక అంశాలు చ‌ర్చించారు. వారి సూచ‌న‌ల మేర‌కు  నడ్డాతో సమావేశం అయిన‌ట్టు తెలియ‌వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా అమరావతి రైతుల ఆందోళన.. రాజ‌ధానిని త‌ర‌లించేందుకు ప్రభుత్వ ం వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు, చేస్తున్న ఆలోచ‌న‌లపైనా న‌డ్డాతో చ‌ర్చించిన ప‌వ‌న్ ఏపీ బీజేపీ తాజాగా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా  చేసిన తీర్మానంపై త‌న హ‌ర్షాన్ని వ్య‌క్తంచేస్తూ, న‌డ్డాని అభినందించారు.  ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల ఆధారంగా  ఇక బీజేపీ..జనసేన కలిసి నడిచే అవకాశాలు దాదాపు ఖరారైనట్లుగా కనిపిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published.