అభిరామ్‌తో పెళ్ళి కోసం శ్రీరెడ్డికి ఏం సలహా ఇచ్చారో తెలుసా…?

ఇక ఇటీవలె ఆమె ఒక యూట్యూబ్ ఛానల్‌ను పెట్టి అందులో లైవ్ చాట్లు చేయడం మొదలు పెట్టింది. తాజాగా లైవ్ చాట్ లో పాల్గొన్న ఈమె ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. తనకు పెళ్ళి ఆలోచన లేదంటూ తన ఫోకస్ అంతా సమాజ సేవ పైనే ఉందంటోంది. తన జీవితంలో జరిగిన కొన్ని ఆకస్మిక సంఘటన వలన ప్రేమ పెళ్లి పై నమ్మకం లేదంటూ తేల్చి చెప్పింది. సురేష్ బాబుతో మాట్లాడి అభిరామ్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవచ్చు కదా అని చాలా మంది సలహాలు ఇచ్చారని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎన్ని కోట్లు ఉన్నా.. ప్రశాంతత అనేది ఒకటి ఉంటుందని.. అది లేకపోతే అన్ని జబ్బులు వస్తాయని.. ఆరోగ్యంగా,ప్రశాంతంగా ఉండటం కావాలని చెప్పుకొచ్చింది. ఇక త్వరలోనే శ్రీరెడ్డి ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థని నిర్మించబోతున్నట్లు వెల్లడించింది.
మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పకుండా చేస్తానంటూ లేదంటే అనవసరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తూ తన సమయాన్ని మాత్రం వృధా చేసుకోనని తేల్చి చెప్పేసింది.