సంక్రాంతి తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మంచి బ్రేక్ ఇచ్చింది భీష్మ

నితిన్, ర‌ష్మిక‌ వెంకీ కుడుముల కాంబినేషన్ లో శివరాత్రి సందర్భంగా విడుదలైన  భీష్మ ప్రేక్షకులకు తెగ‌ నచ్చేసిన‌ట్టుంది. కాసుల వ‌ర్షం కురిపిస్తుండ‌టంతో ఇది రూఢీ అయ్యింది.  ఈ సినిమాకు తొలి రోజు ఏకంగా 7.50 కోట్ల షేర్ వచ్చిందని ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌లో వినిపిస్తున్న మాట‌.  అందులో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 6.30 కోట్ల షేర్ అందుకుంద‌ట ఈ సినిమా. 
 నితిన్ కెరీర్ లో ఇది  బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమా .  గ‌తంలో త్రివిక్రమ్ శ్రీనివాస్  అ..ఆ .. తొలి రోజు 5.55 కోట్లు వసూలు చేయ‌గా  భీష్మ ఆ రికార్డు తిరగరాసిందని ఫ‌లింన‌గ‌ర్ మాట‌. ఇక  ఈ సినిమా పెద్ద‌గా పోటీ సినిమాలు లేక పోవ‌టంతో వీకెండ్ ముగిసేలోపు కచ్చితంగా చాలా ఏరియాల్లో సేఫ్ జోన్ కు నిర్మాత‌ల‌ని తీసుకు వచ్చేలా జోరు  కనిపిస్తోందని సినీ విశ్లేష‌కులు చెపుతున్నారు. 

 ఈ సినిమా  తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల బిజినెస్ చేయ‌గా తొలిరోజు 7.5 కోట్లకు పైగా రావడంతో డిస్ట్రిబ్యూటర్లలో పండగ  వాతావ‌ర‌ణం నెల‌కొంది. సినిమా కామెడీగా ఉంద‌ని, కొత్త‌గా ఉంద‌ని, రొటీన్ ల‌వ్ స్టోరీ అయినా ఎంట‌ర్‌టైన్ బాగుంటంటూ వ‌స్తున్న  పాజిటివ్ టాక్ ఉండటంతో త‌మ‌కు లాభాల పంట పండ‌టం ఖాయ‌మ‌ని చెపుతున్నారు.  ఒక్క నైజాంలో తొలి రోజే 2 కోట్లకు పైగా వసూలు చేసి భీష్మ సంచ‌లం సృష్టించ‌డంతో ధియేట‌ర్ల‌లో స‌క్స‌స్ షేర్ పేరుతో కేక్ క‌టింగ్‌లు చేస్తున్నఘ‌ట‌న‌లు క‌నిపిస్తున్నాయి.   సంక్రాంతి సినిమాల తర్వాత మరో హిట్ లేని తెలుగు ఇండస్ట్రీకి మంచి బ్రేక్ ఇచ్చింది భీష్మఅని చెప్ప‌డంలో సందేహం లేదు. 

Leave a Reply

Your email address will not be published.